Praja Deveena
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 11:22 am Posted by : praja deveena

SIB Chief Prabhakar Rao : బిగ్ బ్రేకింగ్, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్ర భాకర్‌రావుకు సుప్రీంకోర్టు షాక్, తక్ష ణమే లొంగిపోవాలన్న సర్వోన్నత న్యాయస్థానం

SIB Chief Prabhakar Rao : ప్రజా దీవెన, హైదరాబాదు: తెలం గాణ రాష్ట్రంతో పాటు దేశంలోనే సంచలనం రేపిన ఫోన్‌ అక్రమ ట్యా పింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు ఎ స్‌ఐబీ మాజీ చీఫ్‌ టి. ప్రభాకర్‌రావు కు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తక్షణమే లొంగి పోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిం ది.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రేపు అనగా శుక్రవారం ఉదయం 11 గం టలకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పో లీస్‌ స్టేషన్‌లో సిట్‌ దర్యాప్తు అధికా రి ముందు ప్రభాకర్‌రావు లొంగిపో వాలని ఆదేశించింది. జస్టిస్‌ బీవీ నాగరత్న ధర్మాసనం కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకొని సిట్‌కు క స్టోడియల్‌ దర్యాప్తుకు అనుమతి మంజూరు చేసింది. ఇదిలా ఉండ గా దర్యాప్తు సమయంలో ప్రభా కర్‌ రావుకు ఎలాంటి భౌతిక హాని జ ర గకుండా చూసుకోవాలని స్పష్టమై న సూచనలు చేసింది. ఫోన్ ట్యా పింగ్ కేసులో ఇది కీలక మలుపుగా భావిస్తున్నారు. మరింత విచారణ కు సిట్‌కు అవకాశం దొరకడంతో ద ర్యాప్తు మరింత వేగం పెరగనుంది.

సుప్రీంకోర్టు ఆదేశాల పూర్వాపరా ల మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇం టెలిజె న్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రా వుకు సుప్రీంకోర్టు భారీ ఎదురు దె బ్బ తగిలింది. దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటుం డగా, శుక్రవారం అత్యున్నత న్యా యస్థానం సంచలన నిర్ణయంతో ప్ర భాకర్ రావుకు లొంగిపోవాల్సిన ప రిస్థితి ఏర్పడింది.సుప్రీంకోర్టు ఇచ్చి న తాజా ఆదేశాల ప్రకారం, ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ (SIT) అధికారుల ఎదుట బేష రతుగా లొంగిపోవాలి. ఈ ఆదేశా లు కేసు దిశనే మార్చేలా ఉన్నాయ ని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే లొంగిపోయే ప్రక్రియలో లే దా తదుపరి దర్యాప్తులో ప్రభాకర్ రావుపై ఎటువంటి శారీరక హింస, ఫిజికల్ టార్చర్ చేయరాదని సుప్రీం కోర్టు స్పష్టమైన సూచనలు జారీ చే సింది. దర్యాప్తు బృందం పూర్తిగా చ ట్టబద్ధంగా, మానవహక్కులకు విరు ద్ధంగా కాకుండా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది.ఫోన్ ట్యాపింగ్ కే సు ఏకకాలంలో రాజకీయ, చట్టప రంగా ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదే శాలు పరిశీలనీయంగా మారాయి. ప్రభాకర్ రావు స‌రెండ‌ర్ తర్వాత ద ర్యాప్తు వేగం పెరిగే అవకాశం ఉం దని భావిస్తున్నారు.