Big Breaking: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం జూ నూతలలో మహిళ అనుమానా స్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతురాలు మి ర్యాలగూడకి చెందిన జ్యోతిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు జ్యోతికి గత కొంతకాలంగా గుర్రంపోడ్ కు చెందిన ఆర్ఎంపీ మహేశ్ తో వివా హేతర సంబంధం కొనసాగిస్తున్న ట్లు తెలిసింది. అయితే ఇటీవల కాలంలో జ్యోతిని వదిలించుకోవ డానికి పక్కా పథకం ప్రకారం ఆర్ ఎంపీ మహేశ్ గతరాత్రి దేవరకొండ నుంచి కారులో జ్యోతిని తీసుకెళ్తుం డగా అర్థరాత్రి మార్గంమధ్యలో ఇ రువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుందని సమాచారం.
ఈ క్రమంలోనే వెంట తీసుకెళ్లిన గడ్డి మందును జ్యోతికి బలవంతం గా తాగించాడు మహేశ్. దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న త ర్వాత జ్యోతిని పూడ్చిపెట్టేందుకు ప్రయత్నం జరిగినట్లు సమాచారం. సదరు ప్రాంతంలో అనుమానంగా కనిపించడంతో కారును వెంబడించి న పోలీస్ పెట్రోలింగ్ వాహనం నిం దితుడు మహేశ్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు లు విచారణ జరుపుతున్నట్లు తెలి సింది. కొనఊపిరితో ఉన్న జ్యోతిని దేవర కొండ ప్రభుత్వాసుపత్రికి తర లించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమించడం తో ఉస్మానియా ఆస్పత్రికి తరలి స్తుండగా మార్గ మధ్యలోనే తుది శ్వాస విడిచింది.
దీంతో మృతురాలు జ్యో తిని హ త్య చేసి ఆత్మహత్యగా చిత్రీ కరించే ప్రయత్నం చేస్తున్నారని బం దు వులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నా రు. ఈ మేరకు కేసు నమోదు చేసిన విచారణ చేపడుతున్నట్లు గుర్రంపో డు పోలీసులు తెలిపారు.