Big Breaking : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ ప్రభుత్వం తీపికబురు, ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు ఆమోదం
Big Breaking : ప్రజా దీవెన హైదరాబాద్: తెలం గా ణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నిక ల్లో పోటీ చేసే తెలంగాణ ప్ర భుత్వం తీపికబురు అందించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలను కున్న ఆశావాహులకు ఊరట కలిగి స్తూ తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది.
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు ఆ మోదం తెలిపింది. సచివాలయం వే దికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అ ధ్యక్షతన మంత్రి మండలి సమావే శం కొనసాగింది. ఈ భేటీలో పంచా యతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగించాలని నిర్ణయం తీ సుకుoటూ అభ్యర్థికి ఇద్దరు పిల్లలు ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేం దుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చే యనుంది.
ఈ నిర్ణయం వల్ల ఇకపై రెండుకంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి కూడా గ్రామ, మండల, జిల్లా పరిషత్ ఎ న్నికల్లో పోటీ చేసే అవకాశం లభిం చనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేర కు చట్ట సవరణ బిల్లును శాసనస భకు తీసుకెళ్లనుంది. గవర్నర్ ఆ మోదం అనంతరం ఇది అమల్లోకి రానుంది. కాగా ఈ నిర్ణయం స్థానిక ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో పోటీదా రుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తుందని అధికారులు భావిస్తు న్నారు. ఏది ఏమైనా రాజకీయ వ ర్గాల్లో ఈ నిర్ణయం చర్చనీయాంశం గా మారనుంది.