Big Breaking : బిగ్ బ్రేకింగ్, గణేష్ నిమజ్జన ప్రారం భ కార్యక్రమంలో ఉద్రిక్తత, అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం
Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం లో ప్రతిష్టాత్మకమైన ఒక టవ నెంబర్ వినాయక విగ్రహం వద్ద రా జకీయ రచ్చ చెలరేగింది. నల్లగొం డ పట్టణం పాతబస్తీ ఒకటో నం బర్ వినాయకుడి వద్ద నిమజ్జన ప్రారం భ కార్యక్రమంలో శుక్రవారం ఉద యం అధికార, ప్రతిపక్ష పార్టీల మ ధ్య మాటామాట పెరిగి చి లికి చిలికి గాలి వానల మారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొం ది. రోడ్లు భవనా ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిమజ్జన ప్రారం భోత్సవం సందర్భం లో ప్రసంగిస్తుండగా బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా రాజకీయాలు ప్రస్తావించడమే మి ట ని బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్య క్తం చేశారు. ఈ సంఘట నతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తోఫులాటతో ప్రారంభమై దశలో ఘర్షణ వాతావరణo నెలకొంది. దీంతో వెంట నే తేరుకున్న పోలీసు లు జోక్యం చే సుకొని ఇరువర్గాలను నిలువరించే సందర్భంలో బీజే పీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీ సుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్‌కి వర్షిత్ రెడ్డిని తరలిస్తుండగా పోలీ సులను బీజేపీ కార్యకర్తలు, నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసు కుంది. ఈ నేపథ్యం లో వారిని అక్కడి నుంచి పోలీసు లు పంపించే పనిలో పడ్డారు. అ న్యాయంగా బీజేపీ నేతలను అరెస్ట్ చేస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరిం చారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహారి స్తు న్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
*వర్షిత్ రెడ్డి విడుదలకు కంచర్ల డిమాండ్….* ఘర్షణ వాతావర ణo నేపద్యంలో అరెస్ట్ అయన బీ జేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి విడుదలకు నల్లగొండ మాజీ ఎ మ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి డి మాండ్ చేస్తూ బైఠాయించారు. వర్షిత్ రెడ్డిని విడుదల చేసేం త వరకు నిమజ్జనం యాత్ర ప్రారంభించేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. జిల్లా ఎస్పీ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా స్పం దించడంలేదని ఆరోపించారు. ఈ నేపద్యంలో కొద్ది సమయం త ర్వాత నాగం వర్షిత్ రె డ్డిని పోలీసులు విడుదల చేయడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
Nalgonda Ex MLA BhupalReddy comments on Minister KomatiReddy VenkatReddy pic.twitter.com/zuoTs7kuGR
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) September 5, 2025