Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, తీవ్ర విషాదం, పండగ వేళ వాగులోకి దిగి ముగ్గురి మృ త్యువాత 

Big Breaking : ప్రజా దీవెన, డిండి: దసరా సరదా కాస్తా ఆ కుటుంబoలో విషాద ఛా యలు నింపింది. దసరా పండగ వే ళ నల్గొండ జిల్లా చందంపేట మండ లం దేవరచర్లలో తీవ్ర విషాదం నెల కొంది. డిండి వాగులో పడి ముగ్గు రు ప్రాణాలు కోల్పోయారు. పంగడ నేపథ్యంలో గ్రామ సమీపంలోని డిం డి వాగు వద్దకు సాయి ఉమాకాంత్ (10), గోపి (21), రాము (30) వెళ్లా రు. అయితే సాయి ఉమాకాంత్ స్నానం చేసేందుకు వాగులోకి దిగ గా వరద ఉధృతి ఎక్కువగా ఉండ డంతో బాలుడు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. ఇది గమనించిన రాము, గోపి చిన్నారిని కాపాడేందు కు వాగులోకి దిగారు. అప్పటికే వా గు ఉధృతంగా ప్రవహించడంతో వా రిద్దరూ సైతం కొట్టుకుపోయారు. ఆ వాగు సమీపంలో ఉన్న వారు ఇదం తా గమనించి రక్షించేందుకు ప్రయ త్నించారు.

ప్రయత్నాలు విఫలం కావడంతో పో లీసులకు సమాచారం అందించా రు. పోలీసులు ఘటనా స్థలానికి చే రుకుని గజఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అ నంతరం వాగులో గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసుకొ చ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేప ట్టారు. అందులో భాగంగా ఈ మృ తదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా ఒకేసారి ముగ్గురు పండగవేళ చనిపోవడంతో గ్రామం లో తీవ్ర విషాద ఛాయలు అలుము కున్నాయి. మరోవైపు బాధిత కు టుంబాలు తీవ్ర శోకసంద్రంలో ము నిగిపోయాయి. కుటుంబ సభ్యు లను కోల్పోవడంతో గుండెలు ప గిలేలా వారి ఆక్రందనలు అరణ్య రోగనలుగా మిగిలాయి.

అయితే ఈ ముగ్గురి స్వస్థలం ఉ మ్మడి గుంటూరు జిల్లా తెనాలిగా పోలీసులు చెప్పారు. దసరా సెల వుల నేపథ్యంలో వీరంతా నల్గొండ జిల్లా దేవరచర్లలోని బంధువుల ఇం టికి వచ్చారని వివరించారు. కాగా, దసరా సెలవులు ముగియడంతో శుక్రవారం నాడు తెనాలికి బయలు దేరాల్సిఉందని ఇంతలోనే మృ త్యువు ముంచుకొచ్చిందని యు వ కుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంత మవుతూ వెల్లడించారు.