Big Breaking: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రాని కి సంబంధించి భారీ రోడ్డు ప్రమాదా లు రోజురో జుకు పెరిగిపోతూ భ యానక వాతావరణం సృష్టిస్తున్నా యి. మొన్నటికి మొన్న కర్నూల్ ల్ లో జరిగిన సంఘటన మరువక ముందే మళ్ళీ తెలంగాణలో మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ కొనడంతో బస్సులోకి టిప్పర్ దూ సుకెళ్ళి ఘోర రోడ్డు ప్రమాదం జరి గింది. ఈ ప్రమాదంలో 20 మంది దుర్మరణం పాలయ్యా రు. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
టిప్పర్ లోని కంకర బస్సులో పడ డంతో ముందు వరుసలో ఉన్న 5 సీట్లు పూర్తిగా డ్యామేజ్ కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్ప టికే ఈ ప్రమాదంలో బస్సులో ఇరు క్కుపోయి గాయపడిన 15 మంది ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగు తున్నాయి.
కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందే మరో విషాదకర వార్త వినా ల్సి వచ్చింది. చేవెళ్ల సమీపంలో బ స్సులో సురక్షితంగా ప్రయాణిస్తు న్న వారిపైకి మృత్యు శకటంలా లా రీ దూసుక రావడంతో ఏం జరుగు తుందో తెలిసేలోపే ప్రాణాలు గాలి లో కలిసిపోయాయి. అతివేగo, అలక్ష్యం ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. టిప్పర్ లారీలోని కంకరే ఎక్కువ మంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. కంకర ఒక్కసారిగా మీద పడటం తో ప్రయాణికులు ఎక్కువమంది చనిపోయారు. పది మందికిపైగా కంకర కిందే సమాధి అయ్యారు. ఈ ఘటనలో 20 మంది మృతి చెందా రు. మృతుల్లో 18 మంది ప్రయాణి కులు, ఇద్దరు బస్సు, టిప్పర్ డ్రైవ ర్లు ఉన్నారు. ఏడాది పాప సహా 11 మంది మహిళలు, 9మంది పురు షులు మృతి చెందారు. 24 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విష మంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోం ది.
హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తాండూరు డి పో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనతో చేవెళ్ల-వికారాబాద్ మా ర్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్షత గాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రి కి తరలించారు. ఘటనాస్థలిలో జే సీబీతో సహాయక చర్యలు చేపట్టా రు. ప్రమాద స్థలం దగ్గర ప్రమాదకర మలుపు ఉంది. ఓవర్ స్పీడ్‌తో వ చ్చిన టిప్పర్ వేగంగా వచ్చి బస్సు ను ఢీకొట్టింది. మీర్జాగూడ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాం తి చెందారు. ఘటనాస్థలానికి అ ధికారులు వెళ్లాలని సీఎం ఆదే శిం చారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. బస్సు ప్ర మాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సీఎస్, డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరు కోవాలని సీఎం వారితో మాట్లాడా రు. సహాయక చర్యలను ముమ్మ రం చేయాలని , అందుకు అవసర మైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను సీఎం ఆదేశించా రు. అదే సమయంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్ర మాదంపై తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజక వర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై అధికారు లతో మాట్లాడిన స్పీకర్ ప్రసాద్ కుమార్ కి తాండూరు నుండి హై ద రాబాద్ వెళ్తున్న బస్సును రాంగ్ రూ ట్ లో ఎదురుగా వచ్చిన టిప్ప ర్ డీకొట్టినట్లు తెలిపారు. క్షతగాత్రు లకు తక్షణమే వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, తీవ్రంగా గా యపడిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాల ని ఆదేశించారు.