Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 11:26 am Posted by : praja deveena

Union Minister Kishan Reddy : బిగ్ బ్రేకింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ ఫుల్ వ్యాఖ్య,’నన్ను త రిమికొట్టే మొగోడు ఇంకాపుట్టలేదు

Union Minister Kishan Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాజకీయాల్లో కాక రేపుతోంది ‘మెట్రో’వార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్లకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అంతే ఘాటుగా బదులిచ్చా రు. ఆదివారం ప్రెస్ మీట్‌లో రేవం త్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ సం చలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సెగలు రేపుతున్న కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్ ఇలా ఉన్నాయి. మెట్రోరైల్‌ ప్రాజెక్ట్‌కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని ని రూపిస్తే నేను ఇప్పుడే నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరి ఆరు గ్యారంటీలు, ఇచ్చిన హామీలను అమలు చేయ ని మీరు రాజీనామా చేస్తారా?” అంటూ సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి సూటి ప్రశ్న వేశారు.

నన్నుతరిమికొట్టేటోడు ఈగడ్డపైనే లేడు

నన్ను హైదరాబాద్ నుంచి తరిమి కొడతా అంటున్న రేవంత్ రెడ్డి వ్యా ఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పం దించారు. నన్ను అడ్డుకునే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? నే ను భయపడి పారిపోవడానికి బి ఆర్ఎస్ కార్యకర్తను కాదు. నేను కరుడుగట్టిన బీజేపీ కార్యకర్తను న న్ను ఈ గడ్డ నుంచి తరిమికొట్టే వ్య క్తి ఇంకా పుట్టనే లేదని ఘాటుగా స్పందించారు.

కాంగ్రెస్, BRS దొందూ దొందే

తెలంగాణ ప్రజలను, యువతను కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వెన్నుపో టు పొడిచిందని కిషన్ రెడ్డి ధ్వజ మెత్తారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెం డు పార్టీలు ఒకటేనని, లోపాయికా రీ ఒప్పందాలతో నడుస్తున్నాయని ఆరోపించారు. “ఇచ్చిన మాట త ప్పినందుకు ఎవరు రాజీనామా చే యాలో రాహుల్ గాంధీ, రేవంత్ రె డ్డిలే తేల్చుకోవాలని ఎద్దేవా చేశా రు.

ఆట మీరు మొదలుపెట్టారు ము గింపు మాదే

చివరగా సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి గట్టివార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆట మీరు మొదలుపెట్టి ఉం డొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి, 20 28లో ఈ ఆటను ముగించేది మా త్రం ఖచ్చితంగా బీజేపీనే అంటూ హెచ్చరించారు. ఈ పొలిటికల్ ఫై ట్‌తో తెలంగాణ రాజకీయం ఒక్క సారిగా హీటెక్కింది. మరి కేంద్రమం త్రి విసిరిన సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఎలా స్పందిస్తుందో చూ డాల్సి ఉంది.