Praja Deveena
Newspaper Banner
Date of Publish : 10 December 2025, 12:47 pm Posted by : praja deveena

Vikarabad Collector Suspends Officials : బిగ్ బ్రేకింగ్, వికారాబాద్ కలెక్టర్ ప్ర తీక్ జైన్ ఆగ్రహం, విధుల్లో నిర్లక్ష్యం వహించిన 17మంది సస్పెండ్ 

Vikarabad Collector Suspends Officials :

ప్రజా దీవెన, వికారాబాద్: వికారా బాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కన్నెర్ర చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నిక ల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 17 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు.

తాండూర్ కొడంగల్ లోని గ్రామ పం చాయతీ ఎలక్షన్ మొదటి విడత నే పథ్యంలో బ్యాలెట్ బాక్స్ డిస్ట్రి బ్యూషన్ సెంటర్లను వికారాబాద్ జి ల్లా కలెక్టర్ ప్రతీక్ జెన్, ఎస్పీ స్నేహ మెహర సందర్శించారు. మధ్యా హ్నం 3 గంటలైనా కొన్ని గ్రామాలకు బ్యాలెట్ బాక్స్ డిస్ట్రిబ్యూషన్ పం పించడంలో నిర్లక్ష్యం చేసిన అధికా రులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎలక్షన్ డ్యూటీ లో గైర్హాజర్ ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిం చారు.గ్రామపంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గు రు అధి కారులను జిల్లా కలెక్టర్ ప్రతీ క్ జైన్ సస్పెండ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే బుధవారం బషీరా బాద్ మండల డిస్ట్రిబ్యూషన్ కేం ద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కుల్క చర్ల మండలానికి చెందిన పటేల్ చె రువు తండా ఎస్జిటి మానస, నీటూ రు ప్రాథమికోన్నత పాఠశాల స్కూ ల్ అసిస్టెంట్ నసీం రెహనా, పెద్దేము ల్ మండల్ ఎంపీపీఎస్ కు చెందిన స్కూల్ అసిస్టెంట్ అన్నపూర్ణ లకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సం బంధించి పోలింగ్ అధికారులుగా నియమించడం జరిగింది. వీరు వి ధుల్లో బాధ్యతారహితంగా నిర్లక్ష్యం వహించి విధులకు గైర్హాజరు అయి నందున జిల్లా కలెక్టర్ వీరిని విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపా రు.

మొత్తానికి పంచాయతీరాజ్ ఎల క్షన్ విధులలో నిర్లక్ష్యం గైర్హాజరు అ యినా మొత్తం 17 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను వికారాబాద్ జి ల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సస్పెండ్ చే యడం సంచలనo రేకెత్తించింది.