BIG Breaking: ప్రజా దీవెన వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పు ప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి ఆ దాయానికి మించిన ఆస్తులున్నా యని గుర్తించి అరెస్టు చేశారు.వరంగల్, జగిత్యాల, హైదరాబాద్ లలో ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహించి కేసు నమోదు చేశారు.ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ) పు ప్పాల శ్రీనివాస్ ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తులు న్నాయని గుర్తించి అరెస్టు చేశారు.
హనుమకొండ పలివేల్పుల రహ దారిలోని దుర్గా కాలనీలో ఉంటు న్న శ్రీనివాస్ ఇంటికి ఉదయం 9 గంటలకు చేరుకున్న అనిశా అధి కారులు ఆదాయ పత్రాలు, దస్తావే జులు, స్థిర, చరాస్తులకు సంబం ధించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ స్వస్థలమై న జగిత్యాలతో పాటు హైదరా బాద్‌లోని ఆయన నివాసంలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించా రు. సుమారు 10 గంటలపాటు ఆయన్ను విచారించారు. ఇంట్లోని పలు దస్తావేజులు పరిశీలించిన అనంతరం హసన్‌పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి తీసుకుని వచ్చి పలు అంశాలపై సమాచారాన్ని సేకరించారు. అనంతరం తిరిగి ఆయన్ను ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి.
మొత్తంగా రూ.4.04 కోట్ల అక్ర మాస్తుల గుర్తింపు… అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రూ.4.04 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు.ఇందులో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 15 ఎకరా ల వ్యవసాయ భూమితోపాటు 16 ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి పుప్పాల శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. గతేడాది ఫిబ్రవరిలో ఉమ్మ డి వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అంతకు ముందు హైదరాబాద్ రవాణాశాఖ కార్యాలయంలోపనిచేశారు.