BJP : ప్రజా దీవెన, నల్గొండ: బిజెపి జిల్లా అధ్యక్ష పదవికి నాయకుల నుంచి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం నామినేషన్లు స్వీకరించింది పార్టీ జిల్లా ఎన్నికల పరిశీలకులు కట్ట సుధాకర్ రెడ్డి శనివారం నల్గొండలోని బిజెపి జిల్లా కార్యాలయానికి వచ్చి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారు నామినేషన్ సమర్పించాలని పేర్కొన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఉమ్మడి జిల్లాలో వివిధ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని ఇక్కడ జిల్లా అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలిసింది. బిజెపి జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత అధ్యక్షుడు నాగం వర్శిథ్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు, హైదరాబాదులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన అనంతరం పార్టీ నాయకత్వం జిల్లా అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది .
అయితే ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది నల్గొండ జిల్లాకు సంబంధించిన బిజెపి శ్రేణులు అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారని ఎదురు చూస్తున్నా సందర్భం తెలిసిందే..