–మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదు
–తప్పుడు ఆరోపణలు చేస్తే సహిం చబోం, తరిమి కొడతాం
–నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
Gummula Mohan Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్చుకోలే క బిజెపి, బీఆర్ఎస్ నాయకులు ది గజారుడు రాజకీయాలు చేస్తున్నార ని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి విమర్శించా రు. శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కా ర్యాలయంలో నల్గొండ మాజీ ము న్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమే ష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శి స్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిం చారు.
నల్లగొండ పట్టణంలోని 1వ నెంబర్ వినాయక విగ్రహం వద్ద గణేష్ ని మజ్జనం రోజు బిజెపి జిల్లా అధ్యక్షు డితో పాటు మాజీ ఎమ్మెల్యే వ్యవ హరించిన తీరు జుబుక్సాకరమ న్నారు. పరిపక్వత లేని వారిద్దరివి దిగజారుడు రాజకీయాలతో ప్రజలు విసిగివేసారిన ప్రజలు నవ్వుకుంటు న్నారని ఎద్దేవా చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉ త్సవ కమిటీ ఆహ్వానంతో నిమ జ్జనం రోజు ఒకటో నెంబర్ విగ్రహం వద్దకు రావడం జరిగిందని అన్నా రు. మంత్రి మాట్లాడుతుండగా త నను పైకి పిలవలేదని అక్కసుతో బిజెపి జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఘర్షణ వాతా వరణం సృష్టించాడని ఆరోపిం చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రూ.150 కోట్లతో లతీఫ్ షాప్ గుట్ట, బ్రహ్మంగారి ఘాట్ రోడ్డు ని ర్మిస్తున్నామని చెప్పడం జరిగిందని, అది తప్పా అని గుర్తు చేశారు.
ప్రభుత్వం అభివృద్ధి పనులు చేప ట్టిందని చెప్పాడు తప్ప కాంగ్రెస్ చే స్తుందని చెప్పి రాజకీయాలు చేయ లేదన్నారు.బిజెపి జిల్లా అధ్యక్షుడికి కనీస రాజకీయ అవగాహన లేదని ధ్వజమెత్తారు. ప్రశాంత వాతావర ణంలో నిమజ్జన కార్యక్రమాలు జరు గుతుంటే బిజెపి జిల్లా అధ్యక్షుడు జీర్ణించుకోలేకపోయాడన్నారు.
ఘర్షణ వాతావరణం సృష్టించడా నికి ప్రయత్నించగా పోలీసులు అ తన్ని అక్కడి నుంచి తరలించారని అన్నారు.అనంతరం అక్కడికి వ చ్చిన మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్ రెడ్డి కూడా రాజకీయ లబ్ధి కో సం ప్రయత్నించాడని విమర్శించా రు. బిజెపి జిల్లా అధ్యక్షుడితో పా టు మాజీ ఎమ్మెల్యే గన్ మెన్ల కోసం కోసం పాకులాడుతున్నారన్నారు.
కాంగ్రెస్ నాయకులతో దాడులు చే యించుకుని గన్ మెన్ లు పెట్టుకో వాలని చూస్తున్నారని ఎద్దేవా చే శా రు. గన్ మెన్ల కోసం ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్న వీరిని చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారని వి మర్శించారు.మేము దేవుని దగ్గర ఎన్నడూ రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 25 సంవత్సరాలు గా అభివృద్దే ధ్యేయంగా, పేద ప్రజ ల సంక్షేమం కోసం పనిచేస్తున్నాడని అన్నారు.వ్యక్తిగతంగా, పరోక్షంగా 1 0 వేల మందికి సహాయం అందిం చాడని అన్నారు.
నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నోటి దు రుసు వలన గత ఎన్నికల్లో ప్రజలు 54 వేల ఓట్లతో కోమటిరెడ్డి వెంకట రెడ్డిని గెలిపించడం జరిగిందని అ న్నారు. బిఆర్ ఎస్ ఎమ్మెల్యే ఎ న్నికల్లో ఓటమి పాలై, ఎంపీ ఎ న్ని కల్లో డిపాజిట్ కోల్పోయిందని తె లిపారు.రాబోయే స్థానిక సంస్థ ఎ న్నికల్లో కూడా ప్రజలు ఆ పార్టీకి త గిన గుణపాఠం చెబుతారని అ న్నా రు.రెండు మూడు పార్టీలు మారిన వ్యక్తి కూడా యూరియాపై చిల్లర రా జకీయాలు చేస్తున్నాడని, స్థాయిని మించి మంత్రిపై విమర్శనాలు చే స్తున్నాడని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో న ల్లగొండ నియోజక వర్గ అభి వృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికా రంలోకి వచ్చిన తర్వాత మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో అభివృ ద్ధి పనులను చేస్తున్నాడని అన్నా రు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేసుకోవడం జరిగిందని తెలి పారు.
నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డా అని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యేను ప్రజలు గత ఎన్నికల లోనే చీకొట్టారని, అతనిని ఎప్పుడో మరిచిపోయారని అన్నారు.చిల్లర రాజకీయాల కోసం మంత్రి కోమటిరె డ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మే ము సహనం కోల్పోతే గణేష్ నిమ జ్జనం రోజే వారిద్దరికీ గన్ మెన్లు వ చ్చేవారని అన్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన త ర్వాత ప్రజా పాలన సాగుతుందని పేర్కొన్నారు. అన్ని పండుగలు ప్ర శాంత వాతావరణంలో జరుగుతు న్నాయని తెలిపారు.రాజకీయ లబ్ధి కోసం బిజెపి, బీఆర్ఎస్ నాయకు లు ఇలాంటి చిల్లర రాజకీయాలు చే స్తుంటారని విమర్శించారు. ఎక్కడ లేని విధంగా నల్లగొండలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు ఉం దని ధ్వజమెత్తారు.గణేష్ నిమజ్జ నం రోజు నల్లగొండలో జరిగిన సం ఘటనే నిదర్శనం అని తెలిపారు.
ఈ విలేకరుల సమావేశంలో సీని యర్ కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కమిటీ సభ్యుడు కుసుకుంట్ల రా జిరెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూపా అశోక్ సుందర్, నాయకులు బొజ్జ శంకర్, సురిగి వెంకన్న గౌడ్, యూ త్ కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, ఇటికాల శ్రీనివాస్, పి ల్లి యాదగిరి యాదవ్, పెండెం పాం డు, ఎగ్గడి సుజాత, బొబ్బలి స్వ రూప రెడ్డి, పిల్లి రమేష్ యాదవ్ త దితరులు పాల్గొన్నారు.