–ఏడాది చివరాతంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు సన్నద్ధం
–ఆయా రాష్ట్రాలకు ఇన్చార్జిల నియామకంతో పని ప్రారంభం
–జమ్మూకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక బాధ్యతలు
–లోక్ సభ హడావుడి పక్షం రోజులు కాకముందే మళ్ళీ బిజెపి పరుగులు
BJP: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి ఉ త్సాహంతో ఉన్న భారతీయ జన తా పార్టీ (BJP) మరొక ఎన్నికలకు సన్నద్ధ మవుతుంది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి పక్షం రోజులు కూడా గడవకముందే బీజేపీ పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పరుగులు పెడుతోంది. ఈ ఏడాది చివరాంతంలో జరగ నున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (ASSEMBLY ELECTIONS0 కసరత్తు ప్రారంభిం చింది. ఈ క్రమంలో మహారాష్ట్ర, హరియాణా, ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జిల పేర్లను సోమవారం ప్రకటించింది. అత్యంత కీలకమైన మహారాష్ట్రకు ఇద్దరు కేంద్ర మంత్రు లను ఇన్‌చార్జిలుగా నియమించిం ది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఇన్‌చార్జిగా, రైల్వే మంత్రి (RAILWAY MINISTER) అశ్వినీ వైష్ణవ్ సహ ఇన్‌చార్జిగా ఉంటారని పార్టీ ప్రక టించింది. 2014 తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జ మ్మూకశ్మీరుకు కేంద్ర మంత్రి జి.కిష న్‌రెడ్డిని (KISSAN REDDY) ఇన్‌చార్జిగా నియమించిం ది. జమ్మూకశ్మీర్‌లో ఈ సెప్టెంబరు లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉం ది. ఇక మరో కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్‌కు హరియాణా బాధ్యతలు అప్పగించింది. త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌కుమార్ ఆయనకు సహాయం గా ఉంటారని ప్రకటిచింది. ఝార్ఖం డ్ ఇన్‌చార్జిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌ను నియమించింది.
ఆయనకు అసోం సీఎం హిమంతబిశ్వ శర్మ మద్దతుగా ఉంటారని తెలిపింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియా ణాల్లో ఈ ఏడాది చివరలో ఎన్నిక లు జరగనున్నాయి. ఇదిలా ఉండ గా దేశ ఆర్థిక రాజధానిగా పేరొందడ మేగాక అత్యధిక లోక్‌సభ (LOKSHABA) సీట్లున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర రెండోస్థానం లో ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రం నుంచి బీజేపీ (BJP) తొలిసారి పూర్తిగా కొత్త కూటమితో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. షిండే వర్గం శివసేన, అజిత్ పవార్ నేతృ త్వంలోని ఎన్సీపీలతో కలిసి కాంగ్రె స్, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ శివ సేన పార్టీల కూటమిపై పోటీ చేస్తోం ది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారా ష్ట్రలో బీజేపీ బాగా దెబ్బతిన్నది. మొత్తం 48 సీట్లకు గాను 2019లో 23 గెలిచిన ఆ పార్టీ బలం ఈసారి 9 సీట్లకు పడిపోయింది. అదేసమ యంలో కాంగ్రెస్ (CONGRESS) ఒక్క సీటు నుంచి 13 సీట్లకు చేరుకొని అతిపెద్ద పార్టీ గా అవతరించింది. ఈ క్రమంలో మహారాష్ట్రకు బీజేపీ ఇన్‌చార్జిలుగా భూపేంద్ర యాదవ్, అశ్వినీ వైష్ణవ్ నియమితులయ్యారు. వీరి నేతృ త్వంలో గత ఏడాది మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 230 సీట్లకు గాను 163 స్థానాల్లో విజయబావుటా ఎగరవేసింది. ఇక
హరియాణాలోనూ బీజేపీకి ఇబ్బం దికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పార్టీ అధికారంలో ఉన్నప్ప టికీ లోక్‌సభ ఎన్నికల్లో 10 సీట్లకు గాను ఐదింట్లోనే గెలిచింది. అయి తే, రాష్ట్రంలో వరసగా మూడోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకొన్న బీజేపీ (BJP) ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్‌కుమార్‌లను ఇన్‌చార్జిలుగా నియమించింది.