Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJPLP : ప్రజలను ఓటడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు

–బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

BJPLP: ప్రజా దీవెన,నల్గొండ టౌన్: భారతీ య జనతా పార్టీ కార్యకర్త లను రా బోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలి పించుకునేం దుకు కంకణబద్దులు కావాలని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మ హేశ్వర్ రెడ్డి( Eleti Maheswa rR eddy)పిలుపు నిచ్చారు. బీజేపి జి ల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసి న స్థానిక సంస్థల ఎన్నికల కార్యశా లకు ఆయన ముఖ్య అతిథిగా వి చ్చేసిన నిర్మల్ శాసనసభ్యులు, బీ జేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మ హేశ్వర్ రె డ్డి పాల్గొని రాబోయే స్థా నిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజ లు సిద్ధంగా వున్నారని గుర్తు చేశా రు. బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్శిత్ రెడ్డి ( NagamVarshith Reddy) అధ్యక్షతను ఏర్పాటు చే సిన ఈ సమావేశంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాత రంగీతం ఆలపించిన తరువాత కా ర్యాశాలలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.

 

నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వ ర్షిత్ రెడ్డి యువ నాయకత్వంలో నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎ న్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులు ఘ న విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నిక ల ముందు ఇచ్చిన హామీలను విస్మ రించి ప్రజలను మోసం చేస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై మండి ప డ్డారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉం డి ఎన్నో అక్రమాలకు పాల్పడిందని ఆ అక్రమాలను రేవంత్ రెడ్డి ప్రభు త్వం బయటపెట్టడానికి ఎందుకు ని ర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.

కెసిఆర్ కుటుంబంలో కుటుంబ కుం పటి ఏర్పడిందని ఆ కుంపటి వైపు ప్రజలు వెళ్లొద్దని సూచించారు.

 

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్ర భారి మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, మాజీ శాస నసభ్యులు శానంపూడి సైదిరెడ్డి బీ జేపీ స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా క న్వీనర్ వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనో హర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, బిజెపి కి సాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్ యా దవ్ , బీజేపీ నాయకులు బండారు ప్రసాద్, బీజేపీ నాయకులు పిల్లి రా మరాజు, నూకల వెంకట్ నారాయ ణ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి , సాదినేని శ్రీనివాసరావు బీజేపీ ఓబీసీ మో ర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాల కూరి రవిగౌడ్ తదితరులు పాల్గొ న్నారు.