–అత్యవసర సమయంలో క్షతగా త్రులకు ఆయుష్షు
–పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా రక్తదానం కార్యక్రమం
–సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
Blood Donation : ప్రజాదీవెన, సూర్యాపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమా లలో భాగంగా పోలీసు అమరవీరు ల త్యాగాల జ్ఞాపకార్థం శుక్రవారం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పోలీ సు అధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. జిల్లా పోలీస్ కా ర్యాలయంలో ఎస్పీ నరసింహ ఆ ధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వ హించడం జరిగినది.
ఈ రక్తదాన శిబిరంలో జిల్లా ఎస్పీ పాల్గొని మొదటగా రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోలీసు అమరవీరు ల త్యాగాల స్మారకంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, అ త్యవసర సమయాల్లో ప్రజలకు ఎల్ల ప్పుడూ అందుబాటులో ఉంటామ ని ఈ కార్యక్రమం ద్వారా తెలియ జేశామన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఖమ్మంకు చెందిన సికి సెల్ సొసైటీ వారు తల సేమియా వ్యాధితో బా ధపడుతున్న పిల్లల కోసం రక్తాన్ని సేకరించారు. పోలీసుల త్యాగాలు బలిదానాలను ప్రజలు గుర్తించాల ని శాంతి భద్రతల పరిరక్షణలో పోలీ సులతో భాగస్వామ్యం కావాలని ఎస్పి విజ్ఞప్తి చేశారు. రక్తదానం ప్రా ణదానమని ప్రమాదాల బారిన ప డిన క్షతగాత్రులకు అత్యవసర స మయంలో ఎందరో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు.
అలాంటి పరిస్థితి రాకుండా అవస రమైన వారికి సరైన సమయంలో రక్తం అందాలని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పెద్ద ఎత్తున యువత తరలివచ్చి రక్తదా నం చేయడం సంతోషకరమైన వి ష యమన్నారు. తలసేమియా పిల్లల కు ఉపయోగపడే విధంగా స్వచ్ఛం ద సంస్థ వారు కూడా దాతల నుం డి రక్తాన్ని సేకరించారన్నారు.
ఎస్పి వెంట అదనపు ఎస్పి జనా ర్ధన్ రెడ్డి, డీఎస్పీ నరసింహ చారి, ఆర్ ఎస్ఐ లు అశోక్, రాజశేఖర్ రక్తదానం చే శారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పౌ రులు పాల్గొని వారి రక్తాన్ని దానం చేశారు. ఈ శిబిరం నందు పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ వారు కలిసి 100 మందికి పైగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో AR అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, AR DSP నరసింహా చారి, సూర్యాపేట DSP ప్రసన్న కుమార్, పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్, ఆర్ ఎస్ఐ లు అశోక్, సురేష్, రాజశే ఖర్, సాయి రాం, ట్రాఫిక్ ఎస్ఐ సా యిరాం, సిబ్బంది పాల్గొన్నారు.
