Boda Sunil : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వచ్చేంత వరకు ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలుపుదల చేయాలి.. బోడ సునీల్.
Boda Sunil : ప్రజా దీవెన శాలిగౌరారం : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టం వచ్చేంత వరకు ఎలాంటి పరీక్ష ఫలితాలను విడుదల చేయద్దని ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఉమ్మడి నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ బోడ సునీల్ మాదిగ డిమాండ్ చేశారు.ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో ఎమ్మార్పిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను ఎమ్మార్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా కో-ఆర్డినేటర్ బోడ సునీల్ మాదిగ ప్రారంభించారు…
ఈ సందర్బంగా బోడ సునీల్ మాదిగ మాట్లాడుతూ గత సంవత్సరం ఆగస్టు 01న సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్టాలు చేసుకునే అవకాశం ఉందని చెప్పిన వెంటనే నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయకుండా మాదిగలను మోసం చేస్తున్నాడన్నారు.
డా. జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ లో లోపాలను సవరణ చేసి ఈ తెలంగాణ రాష్టంలో మాదిగలు ముప్పై రెండు లక్షలకుపై ఉన్న మాదిగలకు రావాల్సింది 11./. శాంతం కానీ 9./.నిర్ణయంచి మాదిగలను తక్కువ జనాభా చూపెడుతూ మాకు రావాల్సిన వాటాను మాల కులాన్నికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోచిపెడుతున్నాదన్నారు.
ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు చేయక ముందే గ్రూపు1,గ్రూపు2,గ్రూపు3లతో పాటు ఇతర అన్ని ఉద్యోగ పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్న ప్రభుత్వం వాటిని వెంటనే వాయిదా వేయాలని,లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చెప్పాడుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ మండల ఇంచార్జీ కారుపాటి అంబేద్కర్ మాదిగ, ఎమ్మర్పిఎస్ మండల నాయకులు
బట్ట శ్రీనివాస్,బట్ట సైదులు, బాకీ వెంకన్న, మాగి నాగయ్య,బొడ్డు నాగరాజు, దుపెల్లి అశోక్, వేముల శ్రీకాంత్, తోటకూరి సతీష్, బట్ట తిరుమలేష్, బట్ట రఘు,తాటిపాముల జనర్దన్, జింక మధు, గద్దల నగేష్, బట్ట కిరణ్, బట్ట గణేష్, బట్ట అనిల్, బట్ట నరసింహ, ఈదుల నాగేష్, ఉడుగు నరేష్, మాగి వెంకటేష్, పెండెల ప్రశాంత్ మాదిగలు తదితరులు పాల్గొన్నారు