Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bomb Alert: హై అలెర్ట్ , ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు

ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజ ధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు మరోసారి బాంబ్ బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. ఢిల్లీలోని పశ్చిమ్ విహార్‌లోని డీపీ ఎస్ ఆర్‌కె పురం, జిడి గోయెంకా పాఠశాల అనే రెండు పాఠశాలలకు సోమవారం ఉదయం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.దీంతో స్కూల్‌కు బాంబ్ స్క్వాడ్, పోలీసులు చేరుకున్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్ స్కూళ్ళలో తనిఖీలు చేపట్టింది. డీపీఎస్ ఆర్‌కె పురం నుండి ఉదయం 7.06 గంట లకు, జిడి గోయెంకా పశ్చిమ్ విహా ర్ నుండి ఉదయం 6.15 గంటలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయ ని ఓ డీఎఫ్‌ఎస్ అధికారి తెలిపా రు.

అగ్నిమాపక అధికారులు, డాగ్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృం దాలు, స్థానిక పోలీసులు పాఠశా లలకు చేరుకుని సోదాలు నిర్వ హించారు. ఇప్పటి వరకు అనుమా నాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు తెలిపారు.నవంబర్ 29న రోహిణి ప్రాంతంలోని వెంకటే శ్వర్ గ్లోబల్ స్కూల్‌కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వ చ్చాయి. బాంబు బెదిరింపులు సంబంధిత అత్యవసర పరిస్థితుల ను పరిష్కరించడానికి వివరణా త్మక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)తో సహా సమగ్ర కార్యాచర ణ ప్రణాళికను రూపొందించాలని నవంబర్ 19న ఢిల్లీ హైకోర్టు ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను ఆదే శించింది.

ఈ ఆదేశాలను పూర్తి చేసేందుకు కోర్టు ఎనిమిది వారాల గడువు విధించింది. దేశ రాజధాని లోని 40కి పైగా పాఠశాలలకు సోమవారం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో పాఠశాల యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టి విద్యార్థులను ఇంటికి పంపించింది.ఢిల్లీ పొరుగు రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో, లక్నో లోని మూడు కీలక ప్రదేశాలకు బాంబు బెదిరింపు బూటకమని తేలింది. గుర్తుతెలియని కాలర్ శనివారం రాత్రి UP పోలీసుల ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ అయిన 112కి డయల్ చేసి, హుస్సేన్‌గంజ్ మెట్రో స్టేషన్, చార్‌బాగ్ రైల్వే స్టేషన్, అలంబాగ్ బస్టాండ్‌లో బాంబులు పెట్టినట్లు పేర్కొన్నాడు.

కాల్ వచ్చిన తర్వాత మూడు స్థానాలను క్షుణ్ణంగా తనిఖీ చేశామని అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏడీసీపీ)-సెంట్రల్ మనీష్ సింగ్ తెలిపారు. గత కొద్ది రోజులుగా ప్రముఖ తాజ్ మహల్ సహా పలుచోట్ల బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంటూ ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది.