Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Born Baby: ఛీ ఛీ… వీళ్ళ బతుకులు పాడు గాను…ఇంత ఘోరమా…?

Born Baby: ప్రజా దీవెన, రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తుమ్మలోవ వీధిలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను (Born Baby) ఓ ఇంటి ఆవరణలో పెట్టి వెళ్లిపోయారు గుర్తుతెలియని వ్యక్తులు. అప్పటికే చనిపోయి ఉన్న పసిగుడ్డును గుర్తించిన ఇంటి యజమాని రక్తపు మడుగులో (pool of blood)ఉన్న పసి గుడ్డును తీసుకువెళ్లి స్థానిక రైతు బజార్ పక్కన చెత్త కుప్పలో పడేసినట్లు స్థానికులు చెబుతున్నారు.తుమ్మలమ మూడవ అడ్డవీధిలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతు న్నారు. పసి గుడ్డును కుక్కలు పీక్కుతింటుండగా స్థానిక రైతు బజార్లో పనిచేసే సిబ్బంది స్థానిక పోలీసులకు(polcie) సమాచారం ఇచ్చారు. హృదయ విధారకమైన ఈ ఘటనను చూసి స్థానికులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

ఘటనా స్థలానికి చేరుకున్న మూడో పట్టణ పోలీసులు కేసు (Case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజ్‌ను (cc footage) పరిశీలిస్తే అప్పుడే పుట్టిన పసి బిడ్డను వదిలి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు లేక చాలా మంది బాధపడుతుంటే పుట్టిన పసిపిల్లలను కూడా ఎంత దారుణంగా రోడ్లమీద చెత్తకుప్పలో పాడడంపై స్థానికులు మండిపడుతున్నారు. చనిపోయిన పసి గుడ్డును స్థానిక పోలీసులు రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు.