— కూటమి నేతలపై నోరు పారే సుకున్న ఫలితం
–పాత కేసులు తిరగదోడుతున్న పోలీసులు
–కోర్టు అనుమతితో బోరుగడ్డ విచారణకు యత్నాలు
Borugadda Anil: ప్రజా దీవెన, అమరావతి: : వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాన్ (Pawan Kalyan), పీసీసీ అధినేత్రి షర్మిల, బీజేపీ నాయ కులను, వారి ఇండ్లలోని మహిళ లను నోటికి వచ్చిన రీతిలో విమ ర్శంచిన వైసీపీ నాయకుడు, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ ని అదుపులోకి తీసుకుని విచారణ జరపడానికి గుంటూరు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బోరుగడ్డ అనిల్ కు (Borugadda Anil) కోర్టు 13 రోజులు రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంటున్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుంటే వైసీపీకి సంబంధించిన మరి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. దీనికితోడు బోరుగడ్డ వైసీపీ ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయిన విధానం అన్ని పార్టీల్లో చర్చనీయాంశం అయింది. మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ లకు చెందిన మహిళలను దారుణంగా, బండబూతుతు తిడుతూ వీడియోలు చేసి, సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యే విధంగా చేశారు. అప్పటి బోరుగడ్డ అనిల్ ప్రవర్తన ఈ నాయకులెవరూ మర్చిపోలేదు. పవన్ కళ్యాన్ అయితే తమను, తమ ఇండ్లలోని మహిళలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన విమర్శలను మర్చిపోలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ విధంగా రెచ్చిపోయిన నాయకులకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బోరుగడ్డ అనిల్ అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. అయితే రెడ్ బుక్ లోని అన్ని అంశాలను గుర్తు చేసుకుంటానని, ప్రతీ అంశాన్ని అమలు చేస్తానని ప్రకటించి లోకేష్ అందుకు అనుగుణంగా బోరుగడ్డ విషయమై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి బోరుగడ్డ కోసం పోలీసులు వలవేసి పట్టుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఉన్న కేసులను తిరగతోడటం ప్రారంభించారు. 2021లో బాబు ప్రకాష్ అనే వ్యక్తిని డబ్బుల కోసం బెదిరించాడని అరండల్ పేట పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) పై కేసు నమోదు అయ్యింది.
దీనితోపాటు బోరుగడ్డ (Borugadda Anil) పైనాయకులందరినీ వ్యక్తిగతంగా విమర్శించిన వీడియోలను పోలీసులు విచారణ సందర్భంగా వినియోగించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో (police station) ఇతనిపై ఎటువంటి కేసులు, ఫిర్యాదులు ఉన్నాయో పోలీసులు తెలుసుకుంటున్నారు. కోర్టు అనుమతి ఇస్తే పోలీసులు బోరుగడ్డను అదుపులోకి తీసుకుని తమదైన రీతిలో విచారణ జరిపే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం కొందరి నాయకులపై అనుసరించిన రీతిలోనే కూటమి ప్రభుత్వం అనుసరించే అవకాశాలే అధికమని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. తాను కేవలం వైసీపీ నాయకుల సూచనలు, ఆదేశాల మేరకు అటువంటి రీళ్లు చేశానని బోరుగడ్డ ఇప్పటికే పోలీసులకు చెప్పారు. రాజకీయంగా పదోన్నతి ఇస్తామని వైసీపీ నాయకులు చెప్పడం వల్లనే ఆ విధంగా చేశానని ఇప్పటికే పోలీసుల విచారణలో చెప్పాడు. ఇఫ్పుడు కోర్టు అనుమతి ఇస్తే తదుపరి విచారణలో బోరుగడ్డ వెనుకున్న నాయకుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
బోరుగడ్డ అనిల్ రౌడీ షీటర్ అయినా అతని మీద కేసు నమోదు అయినా అప్పట్లో గుంటూరు జిల్లా వైసీపీ నాయకుల ఒత్తిడితో అతని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వైసీపీ అధికారంలో ఉన్నంత వరకు బోరుగడ్డ అనిల్ (Borugadda Anil) పైనోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బోరుగడ్డ అనిల్ కి భవిష్యత్ అంతా మరోలా ఉంటుందని వైసీపీ నాయకులే అంటున్నారు. ప్రజా స్వామ్య దేశంలో అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పార్టీ నాయకులు, అయన అనుచరులు తెలుసుకోక పోతే ఫలితాలు మరో విధంగా ఉంటాయని చెప్పడానికి బోరుగడ్డ అనిల్ ఉదాహరణగా విగిలిపోయే అవకాశం ఉంది.