Breaking news : ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కు కాం గ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన సర్వే ను తప్పు బడుతూ అభ్యంతరకరమైన భాష తో విమర్శలు చేసి కులగణన ఫా మ్ ను దగ్థం చేయడంపై వివరణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ క్రమ శిక్షణ కమిటీ మల్లన్నకు షోకాజ్ నోటీ సులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఓ వైపు శాసన సభ, శా సన మండలిలో కుల గణన నివే దిక వివరాలను ప్రవేశపెట్టిన సంద ర్భంలో సొంత పార్టీకి చెందిన ఎమ్మె ల్సీ మల్లన్న కులగణనను తప్పు బడుతూ విమర్శలు చేయడం ప్రజ ల్లో, ముఖ్యంగా బీసీ వర్గాల్లో సర్వే పై అనుమానాలను, అపోహలను పెంచేసింది.
కులగణనపై అసెంబ్లీలో సాగిన చర్చలో మల్లన్న చేసిన వ్యా ఖ్యలనే బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రస్తా విస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. శాసన మండలిలో సైతం మల్లన్న కులగ ణన లెక్కలను ప్రశ్నించారు. ఈ పరిణామాల మధ్య కులగణనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను సీరి యస్ గా తీసుకున్న కాంగ్రెస్ నాయ కత్వం ఆయనపై చర్యలకు ఉపక్ర మించింది. మల్లన్నపై చర్యలకు ముందు పార్టీ సంస్థాగత ప్రక్రియ మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కులగణన సర్వేను ప్రశ్నిం చడమే కాకుండా మల్లన్న ఇటీవల బీసీ నినాదం ఎత్తుకుని వరుసగా బీసీ సమావేశాలు నిర్వహిస్తూ రెడ్డి సామాజిక వర్గంపైన, సొంత పార్టీ రెడ్డి నేతలపైన ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా వరం గల్ లో నిర్వహించిన బీసీ సభలో రెడ్లపైన, పార్టీలోని రెడ్డి నాయ కుపై న మల్లన్న చేసిన విమర్శలపై తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తాయి.
ఓ దశలో మాకు రెడ్లు, అగ్రకుల ఓట్లు వద్ధంటు..రెడ్లతో మాకు విడాకులం టూ రెడ్లు అసలు తెలంగాణ వారే కాదంటూ మల్లన్న తీవ్ర విమర్శలు చేశాడు.రెడ్డి సామాజికవర్గంపై మల్లన్న చేసిన విమర్శల పట్ల పోలీసు ఫిర్యాదులు కూడా చోటు చేసుకున్నాయి. ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి చర్య లు తీసుకోవాలన్న డిమాండ్ ఊ పందుకుంది. పలువురు మంత్రు లు, పార్టీ ఎమ్మెల్యేలు మల్లన్న వైఖ రిపై మండిపడ్డారు. ఇదే సమయం లోనే మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వ హించిన కులగణన సర్వేపై చేసిన విమర్శలు మరింత వివాద స్పదమై కాంగ్రెస్ నాయకుల్లో ఆయ న వైఖరిపై అసహనం రాజేసింది. ఈ పరిణామాలన్ని చివరకు మల్ల న్నకు కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసే వరకు దారితీశాయి. మల్లన్న సమాధానం సంతృప్తికరంగా లేని పక్షంలో ఆయ నపై వేటు వేయడం ఖాయమన్న ప్రచారం వినిపిస్తుంది.