–ఒకేఒక్క రోజులో లక్షా 4వేల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత
–2021 లో తమ పేర ఉన్న రికార్డు ను పీకే ఓసి 2 బ్రేక్
–ఫలించిన అధికారుల కార్మికుల , సమిష్టి కృషి
— ప్రత్యేక అభినందనలు తెలిపిన సిఅండ్ ఎండి బలరాం
Breaks Records : ప్రజా దీవెన, మణుగూరు: ప్రకాశం ఖని ఓ సి 2 గని ఓబీలో మరోసారి చరిత్ర సృష్టించింది. గురువారం ఒక్క రోజులో లక్ష నాలుగు వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీసి పీకే ఓ సి 2 గని మరోసారి సత్తా చాటింది. సాధారణంగా మూడు షిఫ్టులలో కలిపి రోజువారీ టార్గెట్ 62,000 క్యూబిక్ మీటర్ల ఉండగా గురువారం ఒక్కరోజు 22.5 గంట లలో(1,04,000)లక్ష నాలుగు వేల క్యూబిక్ మీటర్ల ఓబీ తీసిన మైన్ గా పీకే ఓసి 2 ఘనత సాధించడం గమనార్హం.
తన రికార్డును తానే బద్దలు కొ ట్టిన పీకే ఓ సి 2… పీకే ఓసి 2 తన రికార్డును తానే బద్దలు కొట్టు కుంది. 2021 మార్చి 30 వ తేదీన రోజున 1,01,000 క్యూబిక్ మీటర్ల ఓబీ తీసి రికార్డ్ సృష్టించగా ఇప్పు డు గురువారం రోజున 1,04,000 క్యూబిక్ మీటర్ల ఓబీ తీసి తన పే రు మీదున్న రికార్డును బ్రేక్ చేసిం ది.
వరుస ఐదేడ్లు గా బెస్ట్ పర్ఫా మెన్స్ …2020 -21 నుంచి 202 3-24 ఆర్థిక సంవత్సరాలలో ప్రతి సింగరేణి డే డిసెంబర్ 23 న యాం త్రిక సామర్థ్య వినియోగంలో బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డును పీకే ఓసి 2 అందుకుంది. ఈ ఏడాది కూడా 20 24-25 ఆర్థిక సంవత్సరంలో మరో సారి బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డును అందుకోనుంది.
అభినందించిన సీ అండ్ ఎండి బలరాం అత్యధిక ఓబీ రావడం తో సింగరేణి సీ అండ్ ఎండి బల రాం అధికారులను, కార్మికులను, యూనియన్ ప్రతినిధులను అభి నందించారు. అదే విధంగా సింగరే ణి డైరెక్టర్ ఈఅండ్ఎం డి.స త్యనారాయణ రావు, డైరెక్టర్ ఆప రేషన్స్ ఎల్.వీ. సూర్యనారాయణ,
డైరెక్టర్ పీ.పీ కే. వెంకటేశ్వర్లు, మణుగూరు ఏరియా జిఎం రాం చందర్ , అధికారులను, కార్మికుల ను, యూనియన్ ప్రతినిధులను అభినందించారు. ప్రత్యేకంగా పీకే ఓసి 2 ప్రాజెక్ట్ ఆఫీసర్ లక్ష్మీపతి గౌడ్ కి శుభాకాంక్షలు తెలిపారు.