–నల్లగొండలో ఘనంగా మిలాద్ ఉన్ నబి ప్రదర్శన
Milad-un-Nabi Celebration : ప్రజా దీవెన, నల్లగొండ:నల్లగొండ జి ల్లా కేంద్రంలో మిలాద్ జులుస్ కమి టీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అ తిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నల్లగొండ పట్టణ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రవక్త మహమ్మ ద్ ప్రపంచ మానవాళికి స్ఫూర్తి దా యకమని, యువత వారి మార్గాన నడవాలని, కులమతాలకు అతీతం గా మిలాద్ జులుస్ నిర్వహించుకో వాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మి లాద్ జులూస్ కమిటీకి, పట్టణ ప్ర జలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాం క్షలు తెలిపారు. మిలాద్ జులుస్ క మిటీ నిర్వాహకులను అభినందిం చారు. మిలాద్ జులూస్ కమిటీ ఆ ధ్వర్యంలో ర్యాలీని ర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని మహ మ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం జన్మదినం సందర్భంగా వారి ప్రేమలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, నల్లగొండ డి.ఎస్.పి శివరాం రెడ్డిలు ప్రత్యేక మైన బందోబస్తు ఏర్పాటు చేసి ఎ టువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసి నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ర్యాలీ హజరత్ సయ్యద్ షా ల తీఫ్ ఉల్లా ఖాద్రి మెట్ల దగ్గర నుంచి ప్రారంభమై క్లాక్ టవర్ ఆర్పి రోడ్డు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఓల్డ్ సిటీ చౌరస్తా గంజి ఏరియాల నుంచి తి రిగి దర్గా మెట్ల వద్దకు భారీ ర్యాలీ చేరుకున్నది. అనంతరం కమిటీ సభ్యులు దాదాపు 500 మందికి ప్రభుత్వ ఆసుపత్రి లోని పేషంట్లకు, నిరుపేదలకు పటేల్ ఫుడ్స్ వారి రా గి బిస్కెట్లు మరియు పండ్లు, పౌష్టిక ఆహారాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో మిలాద్ జులుస్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ సల్మాన్ ఖాద్రి, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫాజిల్, జనరల్ సెక్రెటరీ సయ్యద్ ఉబేదుల్లా ఖాద్రి, అడ్వైజర్ ఎండి కలీమ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయ కులు ఇంతియాజ్ హుస్సేన్, బిఆ ర్ఎస్ పార్టీ నాయకులు జమాల్ ఖాద్రి, అడ్వకేట్ మసీయుద్దిన్, మా జీ ఏఐఎంఐఎం జిల్లా నాయకులు అహ్మద్ కలీం, సయ్యద్ లతీఫ్ షా వుల్లా ఖాద్రి, ముజావర్ సమీ ఖాద్రి, సుఫియా ఖాద్రి, తబరేస్ ఖాద్రి, అ వేస్ ఖాద్రి, నసిర్, ఫిరోజ్, ఉమైర్ లతో పాటు పురపట్టణ ప్రముఖు లు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.