BRS KCR public meeting : మరికొద్దిసేపట్లో నల్లగొండకు కెసిఆర్ కృష్ణా జిల్లాల జంగ్ సైరన్
--అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తొలి బహిరంగ సభ --శ్రీశైలం,సాగర్లను కేఆర్ఎంబీకి అప్పగించినందుకు నిరసన సభ --లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనున్న కెసిఆర్ --విరామం తర్వాత తొలి సభ కావడంతో భారీ ఏర్పాట్లు
మరికొద్దిసేపట్లో నల్లగొండకు కెసిఆర్
కృష్ణా జిల్లాల జంగ్ సైరన్
–అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ తొలి బహిరంగ సభ
–శ్రీశైలం,సాగర్లను కేఆర్ఎంబీకి అప్పగించినందుకు నిరసన సభ
–లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనున్న కెసిఆర్
–విరామం తర్వాత తొలి సభ కావడంతో భారీ ఏర్పాట్లు
ప్రజా దీవెన/నల్లగొండ: కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, జలాల నదీ యజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఉద్యమ బాట పట్టారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగర్ ఆయకట్టు పరిరక్షణ పేరిట చేసిన ఉద్యమం కెసిఆర్ కు ఎం తో మైలేజ్ ఇవ్వగా ప్రస్తుతం కృష్ణ ప్రాజెక్టు జలాలపై జరుగుతున్న రాజకీయ రణ రంగానికి సిద్ధమై నల్లగొండ నుంచి మలి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
మొత్తానికి లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా ప్రాజెక్టులపై జరుగు తున్న రాజకీయ రగడ క్రమంలో ప్రజల మద్దతు కూడగట్టేందుకు క్షేత్ర స్థాయిలోనే జంగ్ సైరన్ పూరించేందుకు రంగం సిద్ధం చేశారు. తెలం గాణ హక్కుల పరిరక్షణ నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్ల గొండ వేదికగా బహిరంగ సభ నిర్వహించనుండగా గులాబీ అధినేత కెసిఆర్ మరికొద్ది సేపట్లో సభకు రానున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ యజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ పాల్గొంటు న్న తొలిసభ కావడంతో భారీ జనసమీకరణను లక్ష్యంగా పెట్టుకున్నా రు. ఇక్కడి నుంచే గులాబీ పార్టీ అధినేత లోక్‌సభ ఎన్నికల శంఖా రావం పూరించను న్నారు.
సాగు నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించిం దని చెబుతున్న బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధ మైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగిం చినందుకు నిరసనగా నల్లగొండ లో బహిరంగ సభ నిర్వహించను న్నట్లు ప్రకటించిoది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నిర్వహిం చనున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు.
ఇక్కడి నుంచే లోక్ సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల కు జరిగే బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ తో పాటు కృష్ణా పరివా హకంలోని మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మ డి జిల్లాల నుంచి పెద్దఎత్తున రైతులు, ప్రజల్ని తరలి వస్తున్నారు.
బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రు లు, మాజీ ఎమ్మెల్యేలు భారీ కాన్వాయ్‌తో ఉదయం తొమ్మిది గంటల కు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి నల్లగొండ కు చేరుకోగా బి ఆర్ ఎస్ అధినేత కెసిఆర్ హెలీకాప్టర్ ద్వారా సభ ప్రాంగణానికి చేరు కోనున్నారు.
కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్య అని, కాంగ్రె స్ పార్టీకి కేంద్రంతో లోపాయికారి ఒప్పందం ఉందని అందుకే కేఆ ర్ఎంబీకి అప్పజెప్పారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు.కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కాపాడుకోవడం కోసం ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నామన్నారు.
గత పది సంవ త్సరాలుగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి కేఆర్ఎంబీ చేతికి ప్రాజెక్టులు ఇవ్వకుండా మా ప్రభుత్వం కాపాడుకుందని, దురదృష్టవశాత్తు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనుభవలేమి, అవగా హనా రాహిత్యం తో పాటు అంతర్గత ఒప్పందాల కారణంగా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పింది.
మళ్లీ మన ప్రాజెక్ట్ లు సాధించుకోవాలని, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేల్చాలన్న డిమాండ్ తో సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా మరోవైపు బీఆర్ఎస్ సభకు పోటీగా అధికార కాంగ్రె స్ పార్టీ నల్లగొండలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. నల్ల గొండలో నీటి కష్టాలకు కేసీఆర్ కారణమని ఆ పార్టీ నాయకులు విమర్శించారు.
ఉమ్మడి నల్గొండలోని పెండింగ్ ప్రాజెక్టులను కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేస్తామని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్, జిల్లా ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని సభకు వస్తున్నారని మండి పడ్డారు. మరోవైపు శాంతి భద్రతల దృష్ట్యా సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టింది.