Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS Manifesto is confusing for Congress and BJP: కాంగ్రెస్, బిజెపి లకు దిమ్మతిరిగేలా బిఆర్ఎస్ మానిఫెస్టో

-- సీఎం కేసీఆర్ ఆ శుభవార్త ను త్వరలో మీ ముందుకు తెస్తారు -- వచ్చే ఎన్నికల్లో దానిపై ప్రజలనే తీర్పుకోరుదాం -- కాంగ్రెస్ కు 30పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరు -- కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లే

కాంగ్రెస్, బిజెపి లకు దిమ్మతిరిగేలా బిఆరెస్ మానిఫెస్టో

— సీఎం కేసీఆర్ ఆ శుభవార్త ను త్వరలో మీ ముందుకు తెస్తారు
— వచ్చే ఎన్నికల్లో దానిపై ప్రజలనే తీర్పుకోరుదాం
— కాంగ్రెస్ కు 30పైగా నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరు
— కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లే

ప్రజా దీవెన/ నల్లగొండ: తెలంగాణలో బి అర్ ఎస్ అద్భుతమైన మానిఫెస్టోతో ప్రజల ముందుకు (BRS came to the public with a brilliant manifesto) వస్తోందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. కాంగ్రెస్, బిజెపి లకు దిమ్మతిరిగేలా బిఆరెస్ మానిఫెస్టో ఉండబోతుందని జోష్యం చెప్పారు. సీఎం కేసీఆర్ త్వరలో ఆ శుభవార్త చెబుతారని, దాంతో రాష్ట్ర ప్రజలకు సంతోషం ప్రతిపక్షాలకు దుఃఖం మిగులుతుందని స్పష్టం చేశారు.

శుక్రవారం ఆయన యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి వివిధ అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల్లో విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ బిజెపిలను దుయ్యబట్టారు. మీ ప్రాంత కాంగ్రెస్ నాయకుడు నాయకుడు ఒకరు 24 గంటల కరెంట్ రావడం లేదని అబద్ధాలు ప్రచారం(One Congress leader is spreading lies that there is no 24-hour electricity) చేస్తున్నాడని, కరెంటు ఉందో లేదో అందులో వేలు పెట్టు చూస్తే తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పాలనలో అమలు చేసిన ఉచిత కరెంట్ ఉత్త కరెంట్ అని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లేనని హితవు (Talking about current is like spitting on the sun) పలికారు.కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతమని, ప్రజలు అవన్నీ మర్చిపోకముందే సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, మీకు మతిమరుపు ఉంటే ప్రజలకు ఉంటదని అనుకోవడం సిగ్గుచేటు అన్నారు.

కరెంటు విషయంలో ఎన్నికల్లో వెళ్ళడానికి మేము సిద్ధoగా ఉన్నామని, కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా, మా పాలనలో కరెంటు బాగుందా ప్రజలనే తీర్పుకోరుదామని సూచించారు. కేవలం కరెంటు విషయంలోనే ఎన్నికలకు పోదామన్నా తాము సిద్ధంగా ఉన్నామని (They said that they are ready even if they don’t go to the elections only on the issue of electricity) తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ 30, 40 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు సభ్యులు లేరని ఎద్దేవా చేశారు.

నల్లగొండ ఎంపి 24 గంటల కరెంట్ రావడం లేదని అంటున్నాడని, అందులో వేలు పెట్టు చూడు కరెంట్ వస్తుందా లేదా తెలుస్తుందని హితవు పలికారు. ఇంటింటికి తాగు నీళ్ళు ఇచ్చి నీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్ దేనని (KCR is credited with providing drinking water to every house and solving water problems) వివరించారు. గతంలో ఎమ్మేల్యేలు రావాలంటే ముందు నీళ్ళ ట్యాంకర్ వచ్చి నీటి సమస్య తీర్చేవని, రూ. 2వేల పింఛన్లు ఇస్తున్నది సీఎం కేసీఆర్ కాదా అంటూ దేశంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్నది బి అర్ ఎస్ ప్రభుత్వమే అని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వo ఇస్తున్న పెన్షన్ ల మూలంగా గ్రామాల్లో అత్తా, కోడళ్ళ పంచాయతీ లకు బ్రేక్( Break for the panchayats of aunts and daughters-in-law in the villages due to the pensions given by the Telangana government)  పడింది వాస్తవం కాదా ఆని ప్రజలను అడిగి సమాధానం రాబట్టారు.వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్ ఆని కొనియాడారు. కాంగ్రెస్ వాళ్లు నోటికొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారనేను, యాభై ఏళ్ల నుండి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటక, ఛత్తీష్ ఘడ్ లలో ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు.

ఆడబిడ్డ ఉన్న ప్రతి తల్లికి కొండంత అండగా కేసీఆర్ నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 12 లక్షల 74 వేల మంది పెళ్ళిళ్ళకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చామని (Kalyana Lakshmi checks have been given to 12 lakh 74 thousand marriages so far) స్పష్టం చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే కోరిక మేరకు నిధులు పెంచి మొత్తం రూ. 17 కోట్లతో రామన్నపేటలో మంచి ఆసుపత్రి అందుబాటులోకి తీసుకొస్తామని, నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని గుర్తు చేశారు.

నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అన్న నానుడి నుంచి నేడు నేను సర్కారు దవాఖానకే పోతా బిడ్డో అనే వరకు మన వైద్యరంగాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ వృద్ధిలోకి తీసుకొచ్చారని అవన్నీ మన కళ్ళ ముందు సాక్షాత్కారమవుతున్నాయని( Chief Minister KCR has brought our medical sector to growth and all that is being realized before our eyes)  వివరించారు. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగమని అభివర్ణించారు.

కేసీఅర్ ఏనాడు మాట తప్పలేదని, తెలంగాణ తెస్తా అన్నాడు సాధించి చూపెట్టాడు, కానే కాదు రానేరాదు అన్న తెలంగాణను ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధించినాడని గుర్తు చేశారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు కనీసం హైదరాబాద్ లో ఇల్లు కూడా లేదని, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నకిరేకల్ ప్రజల సేవ కోసం (Nakirekal MLAChirumurthy Lingaiah at least has no house in Hyderabad and is for the service of the people of Nakirekal whether he closes his eyes or opens his eyes) కృషి చేస్తారని పేర్కొన్నారు.