–బిఆర్ఎస్ నాయకులు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్
BRS Party : ప్రజా దీవేన, సూర్యాపేట: దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేదంతో శాశ్వత పరిష్కార మార్గం ఉంటుందని గండూరి ట్రస్టు నిర్వాహకులు, బిఆర్ఎస్ నాయకులు, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం 45 వార్డు లోని గండూరి జానకమ్మ రామస్వామి వాటర్ ప్లాంట్ నందు గండూరి ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ దరీయం ఆయుర్వేద నేత్ర క్లినిక్ సహకారంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఆయుర్వేదం అనేది అతి పురాతన కాలం నుండి ఉంది అని ఇంగ్లీష్ మందులు, అలోపతి మందులు వాడితే అప్పటి వరకె ఉపశమనం ఉంటుందని ఆయుర్వేద మందులు వాడితే శాశ్వత నివారణ ఉంటుందని తెలిపారు. ఇప్పుడు డయాబెటిస్ అనేది పదిమందిలో ఆరుగురికి వస్తుందని మనం తినే ఆహారం లోపం వలన డయాబెటిస్ వస్తుందని దానికి కూడా ఆయుర్వేద మందులు వాడితే శాశ్వత నివారణ ఉంటుందని తెలిపారు.
ఈ క్యాంపులో కంటి మచ్చల క్షీణత, ఆప్టిక్ న్యూరోపతి, కంటి నీటి కాసులు, దూరదృష్టి లోపం, సమీప దృష్టిలోపం, నిరంతర పోడి కన్నులు కండ్ల కలకలు, కీళ్లవాతం కీళ్లలో క్షిణించడం, వెన్నెముక సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తి సమస్యలు వెన్ను నరాల నొప్పి, ఉబ్బిన నరాలు తదితర వ్యాధులకు చూస్తున్నారని అవకాశాన్ని వార్డు, సూర్యాపేట పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం వార్డు ప్రజలు టిఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ గురించి మాట్లాడుతూ 60 70 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ వార్డులో ప్రతి ఒక్క ఇంట్లో ఎవరికీ ఏ సమస్య ఉంది అని తెలుసుకొని వారికి ఆర్థికంగా సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి అని అన్నారు. వారు పెట్టే ప్రతి క్యాంపు వార్డు ప్రజలకే కాకుండా సూర్యాపేట పట్టణ ప్రజల కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని అన్నారు. గండూరి కృపాకర్ లాంటి నాయకులు మా వార్డులో ఉండడం మా వార్డు అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ దాస్, శ్రీ ధరీయం బ్రాంచ్ మేనేజర్ పవన్, బెలిదే శ్రీనివాస్, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, గుండా లక్ష్మయ్య, నూకల వెంకటరెడ్డి, ఉప్పల రాజేంద్రప్రసాద్, కుక్కడప్పు బిక్షం, రాచకొండ శ్రీనివాస్, సవరాల సత్యనారాయణ, బోనగిరి భాస్కర్, కక్కిరేణి చంద్రశేఖర్, సందీప్, కళ్యాణ్, ఇస్మాయిల్, ఎండి లతీఫ్, మురారిశెట్టి జోగయ్య, మిర్యాల శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.