Brs party: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ సంచలన వ్యాఖ్య, నియో జకవర్గంలో గడపగడపకు కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ
Brs party:ప్రజా దీవెన, తుంగతుర్తి: రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగు తోందని అందుకు నిరస నగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయ కత్వం పిలుపుమేరకు నియోజకవ ర్గంలో ఇంటింటికి, గడపగడపకూ కాం గ్రెస్ బాకికార్డుల కార్యక్రమం చే పడుతున్నామని మాజీ శాసనస భ్యుడు డాక్టర్ గాదరి కిషోర్ కుమా ర్ తెలిపారు. గురువారం తుంగ తు ర్తి మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగి న స్థాని క సంస్థల ఎన్నికల సన్నాహక స మావేశంలో పాల్గొని మా ట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముం దు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగ లో తొక్కి మోస పూరిత మాటలతో పరిపాలన కొన సాగిస్తుందన్నారు. మహిళలకు ఇస్తాన న్న 2500 రూ పాయలు ఏమయ్యాయి అని క ల్యాణలక్ష్మిలో తులంబంగారం ఏ మైందని విద్యార్థులకు ఇస్తానన్న స్కూటీలు ఎక్కడ పోయాయని కూ లీల సంక్షేమం కోసం ఇస్తానన్న పెన్ష న్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఆరు పథకాలు అమలు చేస్తామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి నేడు ఏ ఒక్క పథకాన్ని కూడా సక్ర మంగా అమలు చేయలేకపోతున్నాడని ఇది ప్రజా సంక్షేమ పాలన కాదని ప్రజా సంక్షోభ పాలనన్నారు.
రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం వారు కూడా సుఖంగా లేరని రైతులను నట్టే ట ముంచారన్నారు .రాష్ట్ర ముఖ్య మంత్రిగా అభివృద్ధి పను లు చేయాల్సింది పోయి బిఆర్ఎస్ పార్టీని దు మ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకు న్నారని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగిన నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ప్రభు త్వం చేపడుతున్న వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీ సుకువెళ్లా లని అన్నారు. నియోజక వర్గంలోని 90 వేల ఇండ్లకు బాకీ కా ర్డు లను అందజేయనున్నట్లు ఆయ న తెలిపారు. అందుకుగాను ఒక లక్ష కార్డులను సిద్ధం చేశామన్నారు.
రానున్న కాలంలో ఏ ఎన్నిక జరిగిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయా లని పిలుపునిచ్చారు .ఈ సంద ర్భంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న పలువురు మాజీ ఎ మ్మెల్యేని కలిసి తమ అభిప్రాయా లను తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు ,మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీత య్య, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి గోపా ల్ రెడ్డి, జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్ ,తుంగతుర్తి పట్టణ శాఖ అధ్యక్షుడు గోపగాని శ్రీనివాస్ గౌడ్, పార్టీ నాయకులు పూర్ణ నాయక్, గోపగాని వెంకన్న లతోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.