*కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం: మల్లయ్య యాదవ్
Mallaya Yadav : ప్రజా దీవెన, కోదాడ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని, పార్టీ నుండి కార్యకర్తలకు, స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని కోదాడ బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ భరోసానిచ్చారు. సోమవారం పట్టణములోని ఆయన నివాసంలో నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట క్లబ్బులు, ఇసుక, గంజాయి, లిక్కర్ మాఫియాలకు కేంద్రంగా కోదాడ నియోజకవర్గంను మార్చిన ఘనత ఉత్తం కుమార్ దంపతులది ఆయన విమర్శించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంతో సంబంధం లేకుండా గ్రామ గ్రామాన గులాబీ జెండా ఎగరాలని ఆయన ఆకాంక్షించారు.భారత దేశ చరిత్రలో అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఇంత ప్రజా వ్యతిరేకత మూట గట్టుకున్న ప్రభుత్వం ఎక్కడా లేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఏ ఒక్క పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించలేకపోతోందని, వాళ్లు ఎన్నికల్లొ ఇచ్చిన హామీలను ఇంకా ప్రారంభించలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి, వైఫల్యాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలని అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలను మరో సారి మోసం చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది అని ఆయన తెలిపారు.రూ. 2 లక్షల రుణాలను మాఫీ చేసేందుకు డిసెంబర్ 9న సంతకం పెడుతా అన్నారు. ఇప్పటి వరకు కోదాడ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో పూర్తిగా రుణమాఫీ జరుగలేదు.. కేవలం 48 % మందికి రుణమాఫీ చేసి రుణమాఫీ పూర్తి అయిందని కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుంది..అప్పుల భారంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.కానీ ఇవాళ డిల్లీకి పోయి రుణమాఫీ చేసినం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవ చేశారు.కేసీఆర్ హయాంలో నాట్లప్పుడు రైతుబంధు పడుతుండే.. ఇప్పుడు ఓట్లప్పుడు పడుతున్నాయి.కేసీఆర్ జమ చేసిన రూ. 7600 కోట్లను పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లప్పుడు వేసిండు. వానాకాలం పంటకు రైతుబంధు ఇవ్వలేదు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 15 వేలు రైతుభరోసా ఇవ్వాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
వానాకాలం రైతుబందును ఎగ్గొట్టింది కాంగ్రెస్ పార్టీ..
కాంగ్రెస్ పార్టీ కి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పడానికి సిద్దంగ ఉన్నారని అన్నారు.ప్రతి గ్రామంలో వాట్సాప్ గ్రూప్ లు, సోషల్ మీడియా సిద్దం చేసుకోవాలని, కేసీఆర్ హయంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అనే అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని ఆయన సూచించారు.కరెంటు కోతలు, రైతు భరోసా, మహిళలకు నెలకు రూ. 2,500 ఇవ్వకుండా ఎలా మోసం చేసారనే అంశాలను ఇప్పటినుండే చెప్పాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రేణలకు సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనలను తీసుకొని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కోదాడ లో మెజారిటీ సీట్లు గెలిచేవిధంగా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్, మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు నయుం, మండల పార్టీ అధ్యక్షులు రమేష్, నర్సిరెడ్డి, జానకి రామాచారి, భూపాల్ రెడ్డి, నాయకులు సురేష్ నాయుడు, మద్ది మధుసూదన్ రెడ్డి, ఇమ్రాన్ ఖాన్, కర్ల సుందర్ బాబు, కౌన్సిలర్లు లలిత, రామారావు, వెంకట్, చంద్రశేఖర్ నియోజకవర్గ పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.