–ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
MLC Kethavath Shankar Naik : ప్రజాదీవెన, నల్లగొండ: సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి దగాకోరు మాటలు ప్రజలు ఎవరు నమ్మడం లేదని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. బుధవా రం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయం లో నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీని వాస్ రెడ్డి తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలైన దద్దమ్మలు బీఆర్ఎస్ పార్టీ పాలకులని పేర్కొ న్నారు. బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న జగ దీష్ రెడ్డి జిల్లా అభివృద్ధికి చేసిందే మీ లేదని ఎద్దేవా చేశారు.
మంత్రులపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బిఆర్ ఎస్ పార్టీ పూర్తిగా ప్రజావిశ్వా సం కోల్పోయిందని స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన సాగించి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృ ద్ధిని జీర్ణించుకోవడం లేదని విమ ర్శించారు. బిఆర్ఎస్ ది ఫామ్ హౌ స్ పాలన, కాంగ్రెస్ పార్టీది ప్రజా పా లనని కొనియాడారు. మీ పార్టీ కల్వ కుంట్ల కవితనే చెప్పింది నువ్వు లి ల్లీపుట్ అంటూ చేసిన వ్యాఖ్యలే అంvదుకు నిదర్శనమన్నారు.
నల్గొండ నియోజకవర్గంలో సొంత నిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి కోటి రూపాయలు కాలువలో చెట్లను, పూడికను తీయించారని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ,డిండి, న క్కల గండి ప్రాజెక్టులు కాంగ్రెస్ హ యాంలోనే అన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మేం చేసిన అభి వృద్ధి, మీరు చేసిన అవినీతిపై చ ర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.మా మంత్రులు జిల్లా సర్వతోము ఖాభి వృద్ధి కోసం పనిచేస్తున్నారనీ అన్నా రు. భూ దందాలు, ఇసుక దందా కంకర దందా చేసిన వాళ్లు గత బిఆ ర్ఎస్ పాలకులని పేర్కొన్నారు.
మా మంత్రులపై అనుచిత వ్యా ఖ్య లు చేస్తే ఊరుకోమని హెచ్చరించా రు.ప్రజలే బిఆర్ఎస్ నాయకులపై తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి మంత్రి అయిన తర్వాత అర్హులైన వారంద రికీ రేషన్ కార్డులు, సన్న బియ్యం వస్తున్నాయని తెలిపారు.కారులైన ప్రతి ఒక్కరికి ఇందిర ఇండ్లు మం జూరు అవుతున్నాయని పేర్కొన్నా రు.ఇలా ఎన్నో చారిత్రాత్మక పథకా లను అమలు చేస్తూ ముందుకు పో తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని స్పష్టం చేశారు.మంత్రులు కో మటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలను విమర్శించే స్థాయి జగదీష్ రెడ్డికి లేదని అన్నారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో పెం డింగ్ లో పెట్టిన సాగు తాగునీటి ప్రా జెక్టులన్నింటినీ మంత్రి ఉత్తంకుమా ర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ని ధులు విడుదల చేసి పూర్తి చేయ డానికి కృషి చేస్తున్నాడని అన్నారు.
డిండి, ఏదుళ్ళ ప్రాజెక్టుకు వేల కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపా రు.
గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హ యాంలోనే కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాజె క్టులను ప్రారంభించిందని వెల్లడిం చారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రాజె క్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు.బి ఆర్ఎస్ హయంలో బ్రాహ్మణ వె ల్లం ల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
ఈ విలేకరుల సమావేశంలో నల్గొం డ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మ న్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జె డ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, నాయ కులు కత్తుల కోటి, రామ్ రెడ్డి, మా మిడి కార్తీక్ తదితరులు పాల్గొన్నా రు.