BRSHarishrao: అకాల వర్షాలకు అగమైన అన్నదాతలు
వడగండ్ల వానతో రైతన్న కష్టం నేలపాలైంది --ప్రభుత్వం వెంటనే రూ. 20 వేల పంట నష్ట పరిహారం అందించాలి --సిద్దిపేట జిల్లా కలెక్టర్,వ్యవసాయ అధికారులతో ఫోన్ లో హరీష్ రావు
BRSHarishrao: ప్రజా దీవెన సిద్దిపేట: సిద్దిపేట నియోజకవ ర్గం లో నిన్న బుధవారం రాత్రి కురిసిన అకాల వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మె ల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో బుధవా రం రాత్రి వడగండ్ల వర్షం అన్నదాత లకు తీవ్ర నష్టం చేసిందని, రైతుల అరుగాళ్ల కష్టం నేల పాలు అయిం దని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, మామిడి పంటల ఫై అకాల వర్షం తీవ్ర నష్టం చేసిందన్నారు. నష్ట పో యిన పంటలకు 20వేల రూపాయ ల నష్ట పరిహారం చెల్లించాలని ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్ది పేట జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధి కారులతో ఫోన్ లో మాట్లాడిన హరీష్ రావు వ్యవసాయ అధికారు లను క్షేత్ర స్థాయిలో పర్యటనకు పంపాలని పంట నష్ట ఫై అంచనా వేసి నష్ట పోయిన రైతుల జాబితా ను ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు.
ఆందోళన లో ఉన్న అన్న దాతలను అదుకోవాలని చెప్పారు. రైతు లు దైర్యంగా ఉండాలని అధైర్య పడొద్దని ఆందోళన చెందోద్దని ప్రభు త్వం ద్రుష్టికి తీసుకెళ్లి ఆర్థిక సహాయం అందిస్తామని హరీష్ రావు హామీ ఇచ్చి రైతులకు మనో ధైర్యాన్ని నింపారు.