BRSJagadishReddy : రేవంత్ రెడ్డి తెలంగాణద్రోహి
-నా వాదన ను తప్పని నిరూపిస్తే చెంప దెబ్బ కు సిద్ధం, నువ్వు సిద్ధమేనా --సీఎం లేని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు మాలిన చర్య -- ఎంత మొత్తుకున్నా సభ లో జనం నుంచి స్పందన లేదు --సీఎం కు సంస్కారం, బుద్ది పెరగలేదు --రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చడటం కాంగ్రెస్ వైఫల్యం కాదా ? --విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
–నా వాదన ను తప్పని నిరూపిస్తే చెంప దెబ్బ కు సిద్ధం, నువ్వు సిద్ధమేనా
–సీఎం లేని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు మాలిన చర్య
— ఎంత మొత్తుకున్నా సభ లో జనం నుంచి స్పందన లేదు
–సీఎం కు సంస్కారం, బుద్ది పెరగలేదు
–రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చడటం కాంగ్రెస్ వైఫల్యం కాదా ?
–విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
BRSJagadishReddy : ప్రజాదీవెన నల్గొండ : సీఎం ఎంత మొ త్తుకున్నా సభ లో జనం నుంచి స్పందన లేదు. అబద్దాలు మాట్లా డుతుంటే ప్రజలు ఎందుకు స్పందిస్తారు ?సీఎం లేని గొప్పలు చెప్పు కోవడం సిగ్గు మాలిన చర్య అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే జగదీష్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. బూతులు తిడితేనైనా స్పందిస్తారని సీఎం బూతులకు తెగ బడ్డారు. సీఎం కు సంస్కారం, బుద్ది పెరగలేదు. సీఎం మాట్లాడిన మాటలు చూసి జ నం నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు.మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. బూతులు తిడితేనైనా స్పందిస్తారని సీఎం బూతులకు తెగ బడ్డారు. సీఎం కు సంస్కారం, బుద్ది పెరగలేదు. సీఎం మాట్లాడిన మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ హయం లో రేషన్ కార్డులు ఇవ్వలేదని సీఎం అబద్దాలు మాట్లాడారు. జూలై 2021 లో ప్రతి పక్ష నేతగా భట్టి విక్రమార్క తన నియోజకవర్గం లో రేషన్ కార్డులు పంచినట్టు అప్పట్లో ట్వీట్ చేశారు. ఇప్పటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీ గా బీఆర్ ఎస్ లో ఉన్నపుడు రేషన్ కార్డుల పంపిణీ గూర్చి ప్రత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. చౌటుప్పల్ లో అప్పటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షం లో నేను రేషన్ కార్డులు పంచాను.6.47 లక్షల రేషన్ కార్డులను కేసీఆర్ హాయం లో పంచాం. నా వాదన ను తప్పని నిరూపిస్తే చెంప దెబ్బ కొట్టించుకోవడానికి సిద్ధం. కాంగ్రెస్ నేతలు చెంప దెబ్బలు తినడానికి సిద్ధం కావాలని సవాలు విసిరారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని యేండ్లు అవుతున్నా రేషన్ కార్డు ల కోసం ప్రజలు ఎదురుచూడటం ఎక్కువ కాలం పాలించిన కాం గ్రెస్ వైఫల్యం వల్ల కాదా అని ప్రశ్నించారు. గతం లో కేసీఆర్ జిల్లా పర్యటనలకు వచ్చినపుడు కొత్త కార్యక్రమాలు ప్రకటించే వారు. నిన్న సీఎం తుంగతుర్తి లో తిట్లు తప్ప ఏమీ ఇవ్వలేదు. కాంగ్రెస్ టీడీపీ పాలన వల్లే నల్లగొండ లో ఫ్లోరోసిస్ మహమ్మారి 2 లక్షల మందిని కబళించింది. నీళ్ల విషయం లో అన్యాయం చేసి మళ్ళీ ఏవో చెబుతున్నారు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పం డించే నల్లగొండ ను 40 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ కాదా అని గుర్తు చేశారు.
వ్యవసాయాన్ని నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పండగలా మార్చారు. కాంగ్రెస్ పాలన వచ్చాక ఒక్క ఎకరాకు అయినా అదనంగా నీరొ చ్చిందా అని ప్రశ్నించారు.నల్లగొండ జిల్లాకు వచ్చిన కాళేశ్వరం జలా లకు కేసీఆర్ హారతి ఇచ్చిన దృశ్యాలు చూడలేదా ?మూడు మెడి కల్ కళాశాలలు జిల్లాకు తెచ్చింది కేసీఆర్ కాదా ? యాదాద్రి ని అ ద్భుత దైవ క్షేత్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా ప్రశ్నించారు.ఎన్నికల కోసం వేసిన రైతు భరోసా పాతది. యాసంగి ది వానాకాలంది వే యాలి. రైతాంగానికి ఇంకా 27 వేల కోట్ల రూపాయలు రేవంత్ ప్ర భుత్వం బాకీ ఉంది.కాంగ్రెస్ టీడీపీ పాలన లో నల్లగొండ పల్లెల పరిస్థితి ఎలా ఉండేది ..కేసీఆర్ వచ్చాక ఎలా అయిందో ప్రజలకు తెలియదా అన్నారు.
తుంగతుర్తి సభ లో సీఎం వచ్చే కన్నా ముందు కూడా కాంగ్రెస్ నేత లు తన్నుకున్నారు.మళ్ళీ ఫ్యాక్షన్ రోజులు తెస్తున్నారు.కేసీఆర్ పా లనలో నల్లగొండ లో ఎలాంటి రాజకీయ కక్షలకు సంబంధించిన కేసులు లేవు.పదేళ్ల పాలన లో మాది నీళ్ల కోసం ఆరాటం. ఇపుడు కమీషన్ల కోసమే కాంగ్రెస్ నేతల ఆరాటం అని విమర్శించారు. కా ర్యక్రమం ఏది అని చూడకుండా రేవంత్ అన్ని పాత్రలు తానే వేస్తు న్నాడని విమర్శించారు.రేవంత్ చర్యలు వీధీ బాగోతాలను మించి పోయాయని ఎద్దేవ చేశారు. కాళేశ్వరం సాక్షిగా నేను చెప్పిన మా టలకు కట్టుబడి ఉన్నా.కేసీఆర్ కు మూడు రోజులు టైమ్ ఇస్తే కన్నె పల్లి పంప్ హౌజ్ మోటార్లు ఆన్ చేసి చూపిస్తాం.ఏ పంప్ హౌజ్ ల దగ్గరైనా చర్చ పెడదామో చెప్పాలని సవాలు విసిరారు.
కాళేశ్వరంలో అన్నీ బాగానే ఉన్నాయి .ఏవీ కులలేదని నిరూపిస్తాం. గోదావరి ని కావాలనే ఎండబెడుతున్నారు. సీఎం వచ్చినా సరే మం త్రి వచ్చినా సరే రైతు సమక్షంలో చర్చకు సిద్ధం.కాళేశ్వరం ఎవరిది తప్పయితే వారు రైతు చేతిలో చెంప దెబ్బ తిందాం. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాల భర్తీ విషయం లో రేవంత్ రెడ్డి చెప్పే వన్నీ అబద్దాలే అని ఆరోపించారు.రేవంత్ స్థాయికి దిగజారి నేను మాట్లాడాలని కొందరు కోరుకుంటున్నారు. నేను అలా చేయను
రేవంత్ మాట్లాడింది ప్రతిదీ అబద్దమని సాక్ష్యాలతో నిరూపించా ..నేను సోడా కలిపానో, నీళ్లు కలిపానో పక్కన బెట్టు ..రేవంత్ లాగా గురు దక్షిణ కింద క్రిష్ణా, గోదావరి జలాలను కిందకు తరలించలేదు బనక చర్ల పై చంద్రబాబు రాసిచ్చిన వాక్యాలనే రేవంత్ చదువు తు న్నాడని మండపడ్డారు.
తాను ఏదీ మాట్లాడినా రాసే, చూపే భాజా బజంత్రీ మీడియా ఉం దనే అహంకారం తో రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ మహామహులనే మట్టికరిపించాం. భవి ష్యత్ లో కూడా నేనేంటో నిరూపిస్తా నల్లగొండ జిల్లాలో రేవంత్ తె లంగాణ సాయుధ పోరాట వీరుల పేర్లు తీసుకున్నారు.వారంతా పోరాడింది కాంగ్రెస్ జమీందార్ల మీదే ఒక్కో సారి మనం ఎంత మం చిగా పంట సాగు చేసినా పంట కంటే లొట్ట పీసు చెట్లే ఎక్కువ గా మొలుస్తాయి. ఇపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రూపం లో నల్లగొండ జిల్లా లో లొట్ట పీసు చెట్లు మొలిచాయని విమర్శించారు.నా ఆస్తు లు రేవంత్ ఆస్తుల గురించి మీడియా నే నా గ్రామం, రేవంత్ గ్రా మం వెళ్లి విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞత తో మాట్లాడితే మంచిది.
నల్లగొండ జిల్లాలో ఇపుడు ఎన్నికలు పెట్టినా బీ ఆర్ ఎస్ అన్ని స్థానాలు గెలుచుకుంటుంది.ఎన్నికలు వచ్చినపుడు ఎవరి సంగతి ఏమిటో ప్రజలే తేలుస్తారు. కాంగ్రెస్ ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము. మేము 25 యేండ్లుగా సంయమనమే పాటిస్తున్నాం స్వీయ నియంత్రణ అవసరమని నిన్న సుప్రీం కోర్టు కూడా చె ప్పిందని గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సు నీత, ఎన్. భాస్కర్ రావు, రవీంద్ర కుమార్, కె. ప్రభాకర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ నేత ఒంటెద్దు నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.