BRSKTRHARISH: ప్రజా దీవెన, హైదరాబాద్: పదేళ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండుగల రోజుల మాదిరిగా కొనసాగింద ని బిఆర్ఎస్ బావబామర్దులు, మాజీ మంత్రులు సిరిసిల్ల, సిద్దిపేట ఎమ్మెల్యేలు కేటీఆర్, తన్నీరు హరీష్‌రావులు పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలోని పదేళ్లలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గా య ని గుర్తు చేశారు. రైతు పక్షపాతిగా నిలిచి న కేసీఆర్‌కు రాష్ట్రప్రజల తరపున ఈ సందర్భంగా అభినందనలు తెలి పారు. బీఆర్‌ఎస్ పా లనపై కాంగ్రెస్ నేతలు బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ధ్వ జమెత్తారు. కాంగ్రెస్‌కు నీటి విలువ తెలియడం లేదని విమర్శించా రు.
సిరిసిల్ల, సిద్దిపేట ఎమ్మెల్యేలు కేటీఆర్, తన్నీరు హరీష్ రావులు త మతమ వేర్వేరు సామాజిక మాధ్యమాల్లో ఘాటుగా స్పందించారు. రైతు సమస్యలను పరిష్కరించడం లో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చే స్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రై తు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేదని మండిపడ్డారు. కనీసం అ ప్పు తెచ్చి వ్యవసాయం చేద్దామంటే ఆఖరికి ఎరువులకు కూడా క రువు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ ప్రభుత్వం అడిగి నట్లుగా రైతులు ఆ ధార్ కార్డులు ఇచ్చినా, వారికి కనీసం బస్తా ఎరు వు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఎందుకుందని ప్రశ్నిం చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.94 లక్షల మెట్రిక్ ట న్నుల ఎరువుల లోటు ఎందుకుందో రైతులకు రేవంత్ ప్రభుత్వం వివరించాలని కో రారు. రూ.266.50 ఉం డాల్సిన బస్తా యూరియా ధర ఇప్పుడు రూ.325 ఎలా అయ్యిందో రైతులకే కాదు, రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలియాలని నిలదీశారు.ఈ బ్లాక్ మార్కెట్ దందాను దగ్గరుండి న డిపిస్తోంది ఎవరని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కృత్రిమ కొర త ఎవరివల్ల ఏర్పడుతుందో చెప్పా లని డిమాండ్ చేశారు. ఆఖరికి ఎ రువులను కూడా బుక్కేస్తున్న మెత న్నలు ఎవరో వెంటనే రేవంత్ ప్రభు త్వం విచారణ జరిపించాలన్నారు.
కేసీఆర్‌పై కక్షతో రైతులకు ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి శిక్ష వేస్తున్నా రని ఆరోపించారు. కన్నేపల్లి పంప్‌హౌస్ నుంచి నీరు తీసుకో వచ్చ ని, కానీ రేవంత్ ప్రభుత్వం కావాలనే నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ప్రభుత్వం స్విచ్ ఆఫ్ మోడ్‌లో ఉందని ఎద్దేవా చేశా రు. మేడిగడ్డతో సంబంధం లేకుండా నీళ్లు తీసుకోవచ్చని అన్నారు. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వా లని కోరారు. లేకపోతే తామే కన్నేప ల్లి వెళ్లి మోటార్లు ఆన్‌చేస్తామని హె చ్చరిం చారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వెళ్తామని హెచ్చ రించా రు