Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRSPolice : రాష్టంలో పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుంది

–కొత్త పనులు లేవు.. జిల్లా మంత్రులు చేసింది ఏమి లేదు

–బియర్ఎస్ పనులకే కొత్తగా బోర్డులు పెట్టుకుంటున్నారు

–కాంగ్రెస్ సర్కార్, మంత్రులపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

–సన్నవడ్ల బోనస్ బోగస్ అయిందని విమర్శ

–జిల్లా మంత్రులకు ఇప్పటికే ఉన్న ఇంచార్జి మంత్రి హోదాలు పీకేశారని ఎద్దేవా

–చండూర్ లో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి లతో కలిసి మీడియా సమావేశం

BRSPolice : ప్రజాదీవెన, నల్లగొండ: కాంగ్రెస్ పాలనలో ఒక్క రూ పాయి అభివృద్ధి లేదు కానీ వందలాది కేసులు పెడుతున్నారని, రా ష్టంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని అనేక అక్రమ కేసు లు పెడుతూ భయపెడుతున్నారని కొత్త పనులు లేనేలేవు, జిల్లా మంత్రులు చేసింది ఏమి లేదు, బియర్ఎస్ చేసిన పనులకే కొత్తగా బోర్డులు పెట్టుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. గురువారం చం డూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చండూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఇల్లు చిన్న కార ణం తో కూల్చి వేశారని, ఇలా కేసులు పెట్టి భయపెట్టి ఓట్లు వేయిం చుకుందాం అనుకుంటె అవివేకమని విమర్శించారు. ఈ సందర్భం గా జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..

చేత్త మాటలు తప్ప చేసింది ఏమి లేదు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్తగా తెచ్చి వేసిన రోడ్డు లేదు. వ్యవసాయరంగం పూర్తిగా నిర్ల క్ష్యానికి గురైంది. తెలంగాణ వచ్చే నాటికీ నల్లగొండ అఖరు లో ఉం టే కెసిఆర్ పాలనలో అగ్రస్థానం లో నిలిచింది. ఎరువులు, విత్తనా లపై రెగ్యులర్ రివ్యూ చేసాం. ఎక్కడ కొరత రాకుండా చూశామ న్నారు. కానీ మళ్ళీ కాంగ్రెస్ పాలన లో నకిలీ విత్తనాలు విచ్చల విడిగా వస్తున్నాయి.

బుధవారం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో వాళ్ళ ఎమ్మెల్యేలే అంటున్నారు. ఇదేం సమీక్షా అని మంత్రులు మాత్రమే మాట్లాడితే మేం ఎందుకు అని ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యేలు మాట్లాడకుంటే అవేం సమావేశాలని ప్రశ్నిం చారు. కేవలం పోలీస్ శాఖ అక్రమ కేసులతో వేదిస్తూ, ప్రజలను పీడిస్తుందని ఆరోపించారు. కొంత మంది ప్రజా ప్రతినిధులు పోలీ సుల నుంచి మామూళ్లు తీసుకోవడం దూరదుష్ట కరం. కోమటిరెడ్డి బ్రథర్స్ కొత్తగా చేసిందేమీ లేదు. మా పథకాలకే కొత్త బోర్డ్స్ పెట్టు కుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అందుకు ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి అడ్రస్ లేకుండా గాయబ్ అవుతున్నాడు.

ఉత్తమ్ కు నీటి పారుదల, సివిల్ సప్లై శాఖ లపై అవగాహన లే దు.కృష్ణా నది తో పాటు గోదావరి జాలలను సైతం ఆంధ్రకు అప్ప జెపుతున్నారు.సీఎం, మంత్రులు కెసిఆర్ నూ తిట్టడంలోనే పోటి పడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలన లో వ్యవసాయరంగం దివాళా కు వచ్చింది. మళ్ళీ బోర్లు వేయాల్సి వస్తుంది.వానాకాలం రైతు భరోసా ఇవ్వలేదు. ఇంకా 17 వేల కోట్లు ప్రభుత్వం బాకీ పడింది.సన్నవడ్ల బోనస్ బోగస్ అ యింది. రుణమాఫీ అంతే అయింది.కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వ లేదు. బిఆరెస్ ఇచ్చిన వాటికే నియామకాలు ఇచ్చారు. ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్ లకు డబ్బులు తీసుకుంటున్నారు.

నల్లగొండ జిల్లాలో బిఆరెస్ నేతలపై, కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతున్నారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు.. ఉద్యమం నుంచి వచ్చాము ఇవి కొత్త కాదన్నారు. వీటిని ఎదుర్కొని ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల విష యంలో దుర్మార్గం గా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ దుర్మార్గ లకు చెక్ పెట్టాలని ప్రజలకు పిలుపు నిస్తున్నాం. జిల్లా మo త్రులకు ఇప్పటికే ఉన్న ఇంచార్జి మంత్రి హోదాలు పీకేశారు. రానున్న కాలం లో ఈ మంత్రి పదవులు కూడా ఉంటాయో లేదో డౌట్ నే అని విమ ర్శించారు.

చండూర్ లో జరుగుతున్న పనులన్నీ బిఆరెస్ సర్కార్ ఇచ్చిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చందుకు మేము ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ పనులు మంజూరు ఇచ్చాము. మునుగోడులో ఇపుడు అక్కడక్కడా జరుగుతున్న పనులన్నీ కెసి ఆర్ హయాంలోనివే అని తెలిపారు. కమీషన్స్ కోసం పనులు అపు డు. బిల్లులు ఆపడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు పాల్వాయి స్రవంతి, రెగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, తదితరు లు పాల్గొన్నారు.