Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Buddha Prasad:పార్లమెంట్ సీపీఏ సదస్సుకు బుద్ధప్రసాదుకు ఆహ్వానం

Buddha Prasad: ప్రజా దీవెన, అమరావతి: భారతదేశ పార్లమెంట్ సీపీఏ సదస్సుకు (Parliament of India CPA Conference) ఏపీ అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ (AP Assembly Panel Speaker), అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ (Buddha Prasad)కు ఆహ్వానం లభించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 23-24 తేదీల్లో జరిగే 10వ కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్సుకు ఆయనకు ఆహ్వానం లభించింది. లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా (Om Birla)గారి అధ్యక్షతన భారత పార్లమెంటులో పదో సీపీఏ సదస్సును పురస్క రించుకొని “ది రోల్ ఆఫ్ లేజిస్లేటివ్ బాడీస్ ఇన్ ఎటైన్ మెంట్ ఆఫ్ సస్టైనబుల్ అండ్ ఇన్ క్లూజీవ్ డెవలప్మెంట్” అంశంపై ఏర్పాటు చేసిన కామన్ వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజియన్ కాన్ఫరెన్సుకు ఆంధ్రప్రదేశ్ శాస నస భ పక్షాన స్పీకర్ చింతకాయల అ య్యనపాత్రుడు, ప్యానల్ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ పాల్గొనవల సిందిగా ఆహ్వానం లభించింది.