–పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారా మన్
–ప్రధానoగా నవరంగాల పైనే పూర్తి స్థాయిదృష్టి కేంద్రీకృతం
–బిహార్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు భారీ కేటాయింపులతో అందలం
–కొత్త పన్ను విధానoతో టాక్స్ పే యర్స్ ను ఆకట్టుకున్న కేంద్రం
–విద్యార్థులు,నిరుద్యోగులు, రైతు లు, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదు పాయాలకు బడ్జెట్ లో సింహభాగం –బంగారం దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం, కొనుగోలుదా రులకు కాస్తoత ఊరట కలిగించే అంశం
–కొత్త పన్ను విధానంలో మార్పులు నిరుద్యోగులు, రైతులు, గ్రామీణాభి వృద్ధికి పెద్దపీట
— దేశంలో ఏడోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రిగా నిర్మలమ్మ రికార్డు
Budget 2024:కార్మిక, కర్షక వర్గాలతో పాటు యువతకు ఉపాధి, శిక్షణ కొంత మంది ఉద్యోగులకు ఊరట కల్పించే దిశగా, మిత్రులకు నిధులు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం (Central Govt) తన పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంగళ వారం పార్లమెంటులో ప్రవేశపె ట్టింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ లా సీతారామన్ ఇప్పుడు రూ.48. 21 లక్షల కోట్లతో పూర్తిస్థాయి పద్దు ను సమర్పించారు. తొమ్మిది రంగా లు, నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టిసారించారు. గతానికి భిన్నంగా ఎటువంటి సూక్తులు, సుత్తి లేకుం డా నేరుగా బడ్జెట్ ప్రసంగం కొనసా గించారు. భారత్‌లో నిరుద్యోగం 9.2 శాతానికి చేరిందని, వికసిత భారత్‌కు, ఆర్థిక వృద్ధికి ఇది ప్రధాన అవరోధంగా మారిందన్న ఆందోళన ల నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణపై ప్రత్యేక దృష్టిసారించారు. ‘పీఎం ప్యాకేజీ’ (‘PM Package’)కింద రాబోయే ఐదేళ్లలో 4.1కోట్ల యువతకు లబ్ధి చేకూరేలా రూ.2ల క్షల కోట్లతో ఐదు పథకాలను ప్రక టించారు.
కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఒక నెల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వడం, ఈపీఎఫ్‌వో (EPFO) చెల్లింపుల ఆధారంగా ఉద్యోగికి, యజమాన్యా నికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అద నపు ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ఇందులో భాగంగా ఉన్నాయి. అంటే, కొత్త ఉద్యోగులకు సంస్థలు చెల్లించే ఈపీఎఫ్‌వో వాటాను నెల కు రూ.3000 చొప్పున రెండేళ్లపా టు తిరిగి రీయింబర్స్ చేయనుంది. ఈ మూడు పథకాలకు దాదాపు లక్ష కోట్లను ఖర్చు చేయనుంది. యువతలో సగం మందికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయని ఆర్థిక సర్వే కూడా ఘోషించిన నేపథ్యంలో రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలోని 500 అగ్రశ్రేణి కంపెనీల్లో కోటి మందికి ఇంటెర్న్‌షిప్‌ను కల్పించనుంది. యువతకు ఉపాధి పెంచేందుకు ముద్రా రుణాల పరి మితిని రూ.10లక్షల నుంచి రూ. 20లక్షలకు పెంచింది. విద్యార్థులకు రూ.10లక్షల వరకూ విద్యా రుణా లు ఇవ్వాలని సంకల్పించింది. వాటి పై 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని ప్రకటించింది. మహిళలపైనా కొన్ని వరాలను కురిపించింది. మహిళల పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంపు డ్యూటీని తగ్గించాలని ప్రతిపా దిం చింది.మహిళలు, బాలికల అభివృద్ధికి రూ.3లక్షల కోట్లను కేటా యించింది. ఉద్యోగాలు చేసే మహి ళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లను నిర్మించనుంది.
అన్ని వర్గాలను బలోపేతం చేసే బడ్జెట్
–కేంద్ర బడ్జెట్‌పై ప్రధాని మోదీ హర్షం
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే కూటమి 3.0 ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తాజా బడ్జెట్‌పై ప్రధాని నరేంద్ర మోదీ (modi) ప్రశంసలు గుప్పిం చారు. అన్ని వర్గాల శ్రేయస్సుకు ఈ బడ్జెట్ గొడుగు పడుతుందన్నారు. దేశంలోని పేదలు, దిగువ మధ్య తరగతి, గ్రామీణులు, రైతులు.. ఇలా అన్ని వర్గాల వారినీ బలోపే తం చేసే దిశగా బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌స భలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని ఓ వీడియో సందేశం ఇచ్చారు. గడిచిన పదేళ్ల కాలంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.
ప్రస్తుత బడ్జెట్ (budget) నూతన మధ్యతరగతికి మరింత సాధికార తను అందిస్తుందన్నారు. అదేవిధం గా యువతకు అపార అవకాశా లను కల్పిస్తుందని పేర్కొన్నారు. విద్య, నైపుణ్యం వంటివి సరికొత్త స్థాయిలో చేరువ అవుతాయ న్నారు. ఎంఎస్‌ఎంఈల ద్వారా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఈ బడ్జెట్ పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. మహిళలకు మరింత వెన్నుదన్నుగా నిలుస్తుం దని తెలిపారు. దళితులు, బీసీలు, గిరిజనులను బలోపేతం (Empowering Dalits, BCs and Tribals)చేయడమే లక్ష్యంగా బలమైన పథకాలను ఈ బడ్జెట్ అందించిందన్నారు. ముఖ్యంగా నూతన మధ్యతరగతి వర్గాన్ని అన్ని విధాలా ఈ బడ్జెట్ బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక భాగస్వామ్య సహకారానికి ఈ బడ్జెట్ హామీ ఇస్తోందన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకం (ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్‌సెంటివ్ స్కీం) దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహద పడుతుందని వివరించారు. ‘‘భారత రక్షణరంగాన్ని ఆత్మని ర్భర్‌గా మార్చేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి. అదేవి ధంగా పర్యాటక రంగానికి భారీ ఊతమిచ్చింది. స్టార్టప్‌లు, సృజ నాత్మక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వ డం ద్వారా నూతన అవకాశాలను బడ్జెట్ పెంపొందించిందని పేర్కొన్నారు.