Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Budget Meetings: ఒకే దేశం ఎన్నిక కేంద్ర క్యాబినెట్ ముందుకు..!

–ఏకాభిప్రాయం కోసం జేపీసీకి అప్పగించే అవకాశం
–జమిలి కోసం రాజ్యాంగానికి ఆరు సవరణలు
–విపక్షం పరోక్ష సహకారం లేకుండా అసాధ్యం

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలో ఎప్పటి నుంచో ఉత్కంఠత రేపుతో న్న ఒకే దేశం ఒకే ఎన్నిక అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. ఎప్పటినుంచో పతాక స్థాయిలో ప్రచారంలో ఉన్న జమిలి ఎన్నికల కు ఎట్టకేలకు సమయం ఆసన్నమై నట్టు సంకేతాలు అందుతున్నాయి. క్రియేట్ చేస్తున్న జమిలి ఎన్నికలను నిర్వ హించేందుకు ఉద్దేశించిన బి ల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోక్‌ సభ, అసెంబ్లీ లు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిపే రాజ్యాంగ సవరణ బిల్లును శీతాకాల సమావే శాల్లో ప్రవేశ పెట్టాలని నిర్ణ యించా మని, గురువారం కేంద్ర క్యాబినెట్‌ లో ఈ బిల్లును ఆమోదించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.

క్యాబినెట్‌ సమావేశం సాధారణం గా బుధవారం జరగాల్సి ఉండగా ఈసారి గురువారానికి వాయిదా వేశారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత లోక్‌సభ, రాజ్యసభలకు చెందిన సంయుక్త కమిటీకి(జేపీసీ) నివేది స్తారని, వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందుతుందని అధికార వర్గాలు తెలిపాయి ఈ మధ్య కాలంలో జేపీసీ వివిధ రా ష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లను సంప్రది స్తుందన్నారు. బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రాలకు పంపుతారని, సగానికి పైగా అసెంబ్లీలు ఆమోదించిన తర్వాత అది చట్టరూపం పొందు తుందని అధికార వర్గాలు తెలిపా యి. కాగా, జమిలి ఎన్నికలపై గత ఏడాది సెప్టెంబరులో ఏర్పాటైన రాంనాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫారసు లను కేంద్ర క్యాబినెట్‌ ఇప్పటికే ఆమోదించింది. కోవింద్‌ కమిటీకి 47 రాజకీయ పార్టీలు తమ అభి ప్రాయాలు తెలిపాయి. 32 పార్టీలు జమిలి ఎన్నికలను సమర్థించాయి. బీజేపీ, బీజేడీ, జేడీయూ, శివసేన వీటిలో ఉన్నాయి. వనరులు ఆదా కావడం, సామాజిక సామరస్యాన్ని కాపాడడం, ఏకకాలంలో దేశం అభి వృద్ది జరగడం దీనివల్ల సాధ్యపడ తాయని అవి భావించాయి.

లోక్‌ సభ, రాష్ట్ర అసెంబ్లీలను ఏకకాలం లో నిర్వహించేందుకు రాజ్యాంగం లోని 83, 172 అధికరణలను సవరించాలని కమిటీ సూచిం చిం ది. దీనివల్ల రాష్ట్రపతి, గవర్నర్‌ రద్దు చేస్తే తప్ప లోక్‌సభ, అసెంబ్లీ ల పదవీకాలం అయిదేళ్లు స్థిరంగా ఉంటుందని కమిటీ భావించింది. బీజేపీ ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో జమిలి ఎన్ని కలను ప్రవేశపెడతామని ప్రజలకు హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి న రేంద్ర మోదీ ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావించారు. కాంగ్రెస్‌, తృణమూ ల్ కాంగ్రెస్‌, ఎంఐఎంతో పాటు అనే క పార్టీలు ఈ ప్రతిపాదనను తీవ్రం గా వ్యతిరేకించాయి. విషయాన్ని జేపీసీకి నివేదించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయ త్నిస్తుందని అధికార వర్గాలు తెలి పాయి జేపీసీ ఏర్పాటయితే దాని ద్వారా అన్ని పార్టీల ప్రతినిధులు, మేధావులు, సామాన్యుల అభిప్రా యాలను కూడా సేకరించడానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న ఎన్నికల విధానాన్ని మార్చ డం భారీ సవాళ్లతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఏకాభి ప్రాయ సాధన తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తోంది.

జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొందితే ఎప్పుడు ఎన్నికలు జరుగుతాన్న విషయం చర్చ జరుగుతోంది. జనగ ణన, నియోజకవర్గాల పునర్విభ జన జరగాల్సి ఉంది కనుక 2029 వరకు ఈ ఎన్నికలకు సన్నద్ధం కావ చ్చని రాజకీయ వర్గాలు భావిస్తు న్నాయి. పరిస్థితులను బట్టి ఈ ఎన్నికల ప్రక్రియను ముందుకు జర పవచ్చునని కూడా చర్చ జరుగు తోంది.ఒకే దేశం–ఒకే ఎన్నిక నిర్వ హించాలంటే ముందుగా రాజ్యాం గానికి ఆరు సవరణలు చేపట్టాల్సి ఉంది. ఇందుకు ఆరు బిల్లులు ప్రవేశ పెట్టాల్సి ఉంది. వీటిని పార్లమెంటులో మూడింట రెండొం తుల మెజార్టీతో ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పార్లమెం టులో ఎన్‌డీఏకు సాధారణ మెజా ర్టీ ఉందే తప్ప 2/3 మెజార్టీ లేదు. రాజ్యసభలో 245 సీట్లు ఉండగా, ఎన్‌డీఏ బలం 112 మాత్రమే. ప్రతి పక్షాలకు 85 సీట్లు ఉన్నాయి. రా జ్యాంగ సవరణ బిల్లులో ఆమోదం పొందాలంటే 164 ఓట్ల అవసరం ఉంది. లోక్‌సభలో మొత్తం 545 స్థానాలు ఉండగా ఎన్‌డీఏకు 292 సీట్లే ఉన్నాయి. 2/3 మెజార్టీ అంటే 364 మంది సభ్యుల మద్దతు అవ సరం ఉంటుంది.

ఇక్కడ చిన్న మెలి క కూడా ఉంది. మొత్తం సభ్యులను పరిగణనలోకి తీసుకోకుండా సభ కు హాజరయి, ఓటు వేసిన వారిలో 2/3 శాతం మెజార్టీ సరిపోతుం దన్న నిబంధన ఉండడంతో చివరి నిమిషంలో అనూహ్యమైన పరిణా మాలకు కూడా అవకాశం ఉంటుం ది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో జమిలి ఎన్నికల గురించి గట్టిగా చెప్పినప్పటికీ ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ ఈ హామీపై కొన్ని నెలలు చప్పుడు చేయలేదు. కేంద్రంలో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి ఉండ టం, హరియాణా, మహారాష్ట్రలలో లోక్‌సభ ఎన్నికల్లో దెబ్బతిన్న నేప థ్యంలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేయడ మన్నది అనుమానాస్పదం కావడం తో నిజంగానే జమిలి సద్దుమణి గింది. అయితే, మహారాష్ట్ర, హరి యాణాల్లో బీజేపీ తిరుగులేని విజ యాలు సాధించడం, కాంగ్రెస్‌ ఆత్మ రక్షణలో పడటం, ఎన్డీయే మిత్రప క్షాలన్నీ జమిలి విషయంలో బీజేపీ కి దన్నుగా నిలబడిన నేపథ్యంలో సవరణలను ముందుకు తీసుకెళ్ల గలమని అధికారపక్షం భావిస్తోంది.

ఇప్పుడు సగం రాష్ట్రాల్లో బిల్లును ఆమోదించుకోవడం ఎన్డీయేకు స మస్య కాదు.ప్రస్తుతం పలు దఫా లుగా ఎన్నికలు జరుగుతుండ డం తో సమయం, ధనం వృథా అవు తోందని ప్రభుత్వం భావిస్తోంది. దానికితోడు ఎన్నికల కోడ్‌ వల్ల అభివృద్ధి పనులు చేపట్టడంలో సమస్యలు వస్తున్నాయని అంటోం ది. అందువల్ల అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ప్రతిపాద నలు సిద్ధం చేస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాదని ప్రతిపక్షాలు అంటు న్నాయి. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలనే ఎలక్షన్‌ కమిషన్‌ విడ తల వారీగా జరుపుతోందని, అ లాంటప్పుడు అన్నింటిని ఒకేసారి ఎలా జరపగలుగుతుందని ప్రశ్ని స్తున్నాయి. ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని కూడా వాదిస్తున్నాయి.