Lions Club Zone Chairman : శాలిగౌరారం జూలై 1. : శాలిగౌరారం లయన్స్ క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు ను లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మెన్ గా 2025-26 సంవత్సరానికి జిల్లా గవర్నర్ లయన్ రేపాల మదన్ మోహన్ నియమించారు.శాలిగౌరారం లో లయన్స్ క్లబ్ ను ఏర్పాటు చేసిన శ్రీనివాసులు క్లబ్ ప్రసిడెంట్ గా, డి సి మెంబర్, చార్టర్ ప్రసిడెంట్ గా పదవులు చేపట్టారు. మండలం లో అనతి కాలంలోనే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి పలు అవార్డులు అందుకున్నారు.
జిల్లా, రాష్ట్ర స్థాయిలో శాలిగౌరారం క్లబ్ సేవలను తీసుకెళ్లడం శ్రీనివాసులు ఎంతో కృషి చేశాడు. అయన సేవలను గుర్తించిన జిల్లా గవర్నర్ మదన్ మోహన్, తదితర లయన్ పెద్దలు బుడిగె శ్రీనివాసులు ను జోన్ ఛైర్మెన్ గా నియమించారు.ఈ సందర్బంగా జోన్ ఛైర్మెన్ గా ఎన్నికైన శ్రీనివాసులు మాట్లాడుతూ తన పరిధిలో ఉన్న లయన్స్ క్లబ్ లు మరింతగా గ్రామీణా ప్రాంతాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టెందుకు కృషి చేస్తానన్నారు.తన నియామకానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.