Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

C M A. Revanth Reddy : మహిళలకు తీపికబురు, నియోజ కవర్గానికో పెట్రోల్ బంక్

C M A. Revanth Reddy : ప్రజా దీవెన, నారాయణపేట: తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి వీలుగా ప్రతి జిల్లా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పె ట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడా నికి అవసర మైన చర్యలు తీసు కోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశిం చారు. తొలి దశలో జిల్లా కేంద్రాల్లో ఆ తర్వాత ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలో ఒక్కొక్క పెట్రోల్ బంక్ ఏ ర్పాటు చేసుకోవడానికి ముఖ్యమై న ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించాలని చెప్పారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో దేశంలోనే మొట్టమొదటిదిగా నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో ఏర్పాటు చే సిన పెట్రోల్ బంక్‌ను మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్య మంత్రి ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలను ఉద్దేశించి మాట్లాడారు. “పట్టణ, గ్రామీణ సంఘాలన్న తారతమ్యాలు లే కుండా మహిళలంతా ఒక్కటే. తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సం ఘాలలో సభ్యులుగా చేర్చాల్సిన అవసరం ఉన్నది. కోటి మందిని చేర్చుకుని అవకాశం వస్తే ఏదో ఒకరోజు మహిళలందరూ హైద రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మొత్తం మన మహిళా శక్తిని ప్రపంచానికి చాటుదాం. ఆ కార్యక్రమానికి ప్రధా నమంత్రి ని కూడా ఆ హ్వాని ద్దాం.ప్రభుత్వం ఒక్కొ క్కటిగా పరిష్కరించుకుంటూ వస్తోంది. ప్రజా పాలనలో మహిళ లకే తొలి ప్రాధాన్యత ఉంటుంది. వారు ఆత్మగౌరవంతో బతికినప్పు డే ఆ కుటుంబాలు నిలబడు తాయి. మహిళా సంఘాలకు ఇప్పటికే అనేక పనులు అప్పగించాం.

 


అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వ హణ, సూళ్లల్లో పిల్లల యూనిఫా మ్‌లు కుట్టించే కార్యక్రమాలను అప్పగించాం. ఐకేపీ కేంద్రాలు మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మహిళా సమాఖ్యల ద్వారా 600 బస్సులు ఆర్టీసీకి అద్దెకు నడిపించే కార్యక్రమం ప్రారంభమైంది.
దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం కల్పించాం. అదానీ, అంబానీలతో పోటీపడి సోలారు విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యాపారాన్ని ఆడబిడ్డల చేతికి ఇచ్చాం. గ్రామాల్లో మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి వీలుగా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో అత్యంత ఖరీదైన మూడున్నర ఎకరాల స్థలంలో 150 స్టాల్స్ ఏర్పాటు చేశాం.67 లక్షల మహిళా సంఘాల సభ్యులకు వెయ్యి కోట్ల రూపాయల మేరకు వెచ్చించి ఏటా రెండు చొప్పున 1.3 కోట్ల నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పాఠశాలల్లో ముఖ్యంగా ఆడపిల్లల బాధలు వారి తల్లులకే ఎక్కువగా తెలుస్తాయి. అందుకే స్కూళ్ల నిర్వహణ మహిళా సంఘాలకు అప్పగించామని, బడులను బాగా చూసుకోవాలని సూచించారు.

నిధులు ప్రభుత్వం ఇస్తుందని, నిర్వహణ మీరు చూసుకోవాలి. నిర్వహణ సరిగా చేయకపోతే ప్రయోజనం ఉండదు. టీచర్లు రాకపోతే కలెక్టర్లకు ఫిర్యాదు చేయండి. టీచర్లు రాకపోతే ప్రభుత్వం ఎంత ఖర్చు చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఊర్లో గుడి కోసం మనమంతా తలా ఒక చేయి వేసి ఎలా అభివృ ద్ధి చేసుకుంటున్నామో అదే తర హాలో బడిని కూడా ఆ రకంగా నిర్వ హించుకోవాలి. గుడిని ఎంత పవిత్రంగా నిర్వహించుకుంటామో బడిని కూడా అదే తీరులో చూసుకోవాలి” అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజన ర్సిం హ, జూపల్లి కృష్ణారావు, ధనసరి సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , లోక్‌సభ సభ్యులు డీకే అరుణ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన శాస నసభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి శాంతి కుమారితో పాటు ఇత ర అధికారులు పాల్గొన్నారు.