Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cabinet meeting budget:బడ్జెట్‌ పద్దుకు తుది మెరుగులు రూ. 2.90 లక్షల కోట్లు…!

–ఈ నెల 25న క్యాబినెట్‌ భేటీ బడ్జెట్‌కు ఆమోదం, ఆ వెంటనే అసెంబ్లీలో ప్రవేశం
–శాఖలు, పథకాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులకు విస్త్రుత ఏర్పాట్లు
–వ్యవసాయం, నీటి పారుదల శాఖ లకు కేటాయింపుల్లో సింహభాగం

Cabinet meeting budget:ప్రజా దీవెన, హైదరాబాద్‌: తెలగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ కు రంగం సిద్ధం అయ్యింది. రుణ మాఫీ, ఆరు గ్యారెంటీలు స హా అన్ని పథకాలను పరిగణనలో కి తీసుకుని రూ.2.90లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించేందుకు వి స్త్రుత ఏర్పాట్లు చేస్తోంది సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy)ప్రభుత్వం. ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు ఏప్రిల్‌ నుంచి జూలై వరకు నాలుగు నెలలకోసం ప్రవేశపెట్టిన ‘ఓట్‌–ఆన్‌–అకౌంట్‌’ బడ్జెట్‌ గడువు ఈ నెల 31తో ముగియనుండడం తో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపె ట్టాల్సిన పరిస్ధితులు నెలకొన్నా యి.ఈ మేరకు శాఖలవారీగా బడ్జె ట్‌ ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్షించారు.

ఆయా శాఖలు తమ అవసరాలకు అనుగుణంగా వివరించగా ప్రభుత్వం కూడా బడ్జెట్‌పై ఒక అంచనాకు వచ్చినట్లు చెబు తున్నారు. ఈ నెల 22న ఆర్థిక శాఖ అధికారులతో భేటీ కానున్న సీఎం రేవంత్‌రెడ్డి శాఖలు, పథకాల వారీగా కేటాయించిన పద్దులను పరిశీలించి ఓకే చెప్పనున్నారు. ఈ నెల 25న ఉదయం క్యాబినెట్‌ సమావేశంలో 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌–1లో మంత్రి మండలి సమావేశమవుతుందని సీఎస్‌ శాంతికుమారి శనివారం ఉత్తర్వు లను జారీ చేశారు. అదే రోజు(2 5న) అసెంబ్లీల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టను న్నారు. శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ప్రభు త్వం ఈ నెల 23న పార్లమెంటులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నుంది.

అందులో రాష్ట్రానికి వచ్చే కేంద్ర గ్రాంట్లు, కేంద్ర సౌజన్య పథకాలు (Central Grants, Central Courtesy Schemes)(సీఎస్‌ఎస్‌), పన్నుల్లో వాటాలకు సంబంధించిన నిధులను పరిశీలించిన తర్వాత.. స్వల్ప మార్పులతో రాష్ట్ర బడ్జెట్‌కు తుదిరూపు ఇవ్వనున్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.2,90,396కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కానీ… కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ బడ్జెట్‌పై (Government budget)తీవ్ర విమర్శలు చేసింది. వాస్తవ రాబడులను పరిగణనలోకి తీసుకోకుండా భారీ బడ్జెట్లను ప్రవేశపెట్టిందని ఆరోపించింది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. వాస్తవ రాబడులను పరిగణలోకి తీసుకుని రూ.2,75,891 కోట్లతో ‘ఓట్‌–ఆన్‌–అకౌంట్‌’ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అమలు చేస్తున్న గ్యారెంటీలు, రుణ మాఫీ నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను మళ్లీ రూ.2.90 లక్షల కోట్ల వరకు పెంచనుందని తెలిసింది.

వ్యవసాయ శాఖదే పెద్ద పద్దు

ఈ సారి బడ్జెట్‌లోనూ వ్యవసాయ శాఖకే భారీ కేటాయింపులు చేయనున్నారు. ముఖ్యంగా రుణ మాఫీకి రూ.31వేల కోట్లు, రైతు భరోసాకు రూ.15వేల కోట్లు, రైతు బీమాకు (Farmer’s Insurance) మరో రూ.7వేల కోట్ల వరకు అవసరమవుతాయన్న అంచనాలున్నాయి. మరోవైపు.. పాత బకాయిల చెల్లింపు, పాల మూరు–రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులకు నిధుల ఆవశ్యకత దృష్ట్యా సాగునీటి పారుదల శాఖ ఈసారి రూ.19వేల కోట్ల వరకు ప్రతిపాదనలను సమర్పించింది. ఇందులో రూ.11వేల కోట్ల వరకు కేటాయించే అవకాశాలున్నాయి. ఆరు గ్యారెంటీల్లోని రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు వంటి పథకాలను ఇప్పటికే ప్రభు త్వం పూర్తి స్థాయిలో అమ ల్లోకి తెచ్చిన నేపద్యంలో వీటికి ఈ బడ్జె ట్‌లో నిధుల కేటాయింపులు చేయ నుంది. కేంద్ర బడ్జెట్‌లో పీఎంఆవాస్‌ యోజన కింద రాష్ట్రానికి వచ్చే నిధులను పరిగణనలోకి తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల (Indiramma houses)పథకానికి నిధులను ఖరారు చేయనుంది.