–తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన
–నేటీ కేబినెట్ భేటీలో చర్చతో అ సెంబ్లీలోనే తీర్మానం, ఆమోదంకు నిర్ణయం
Cabinet meeting: ప్రజా దీవెన, హైదరాబాద్: వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు ల్లో (Medical Education Undergraduate Course) ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (యూజీ నీట్) కురాష్ట్రాలు విముఖత చూపుతున్నాయి. అందులో భాగంగా యూజీ నీట్ రద్దు చేసి రాష్ట్రానికే ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని తెలం గాణ ప్రభుత్వం డిమాండ్ చేయ నుంది. ఈ మేరకు గురువారం జరిగే మంత్రి మండలి సమా వేశం లో నిర్ణయం తీసుకుని ప్రస్తుతం జరుగుతున్న శాసనసభసమా వేశాల్లో నైనా లేదా వచ్చే వర్షాకాల సమావేశాల్లోనైనా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించా లన్న ఆలోచనతో తెలంగాణ ప్రభు త్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటి కే కేంద్రానికి పంపించాలని కర్ణాటక లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు సమా చారం. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే గతంలో మాదిరిగా సొంతంగా వైద్య విద్యకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షను జరుపు కునేలా ఆదేశాలు ఇవ్వాలని కర్ణా టక ఉపముఖ్యమంత్రి డీకే శివకు మార్ (Mar to DK Shiva)కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పుడు అదే వరుసలో పశ్చిమ బెంగాల్ (West Bengal) కూడా చేరడంతో మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడు గులు వేస్తున్నట్టు సమాచారం.నీట్ రద్దు చేయాలని ఇప్పటికే తమిళ నాడు ప్రభుత్వం రాష్ట్ర శాసన సభ లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వా నికి పంపించగా తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడా తీర్మానం చేసింది. నీట్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత పశ్చిమ బెంగా ల్ అసెంబ్లీ బుధ వారం నీట్ ను రద్దు చేస్తూ తీర్మానం చేయడం సర్వత్రా చర్చకు దారి తీసింది. గత వారమే నీట్ ను రద్దు చేస్తూ కర్ణాటక రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసింది. త్వరలో జరిగే శాసన సభ సమావేశంలో నీటన్ను రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి 2021వ సంవత్స రంలో తమిళనాడులో ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభు త్వం కూడా నీట్ నుంచి మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించిం ది.
పళనిస్వామి (Palaniswami) నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం కూడా ఇదే విధమైన ప్రయత్నం చేసింది. అయి తే 2017లో బిల్లు రాష్ట్రపతి ఆమో దం పొందడంలో విఫలమైంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రతీ ఏటా నీట్ ప్రశ్నాపత్రం బయటకు పొక్కుతుం డడం, ప్రతిభ కనబరిచిన విద్యార్థు లు జాతీయ స్థాయి ర్యాంకుల సాధనలో వెనకబడుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రతీ ఏటా నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రకటించే తొలి పది ర్యాంకుల్లో కనీసం నాలుగైదు సాధించే వారని, ఈ ఏడాది జరిగిన నీట్ ప్రశ్న పత్రం లీక్ కావ డంతో తెలంగాణ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రభుత్వం భావి స్తోంది. తెలంగాణ విద్యార్థులకు నీట్లో మంచి ర్యాంకులు రాకపో వడం వల్ల జాతీయ స్థాయిలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Allindia Institute of Medical Sciences) (ఎయిమ్స్) జిప్మార్ వంటి ప్రతిష్టాత్మక విద్య సంస్థల్లో ప్రవేశాలు లభ్యం కావడం లేదన్న ఆవేదన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో వక్తమవుతున్న నేప థ్యంలో నీట్ పై కీలక నిర్ణయం తీసు కోవాలన్న ఆలోచనకు రాష్ట్ర ప్రభు త్వం వచ్చినట్టు సమాచారం. నీట్ ను రద్దు చేస్తూ మంత్రి మండలి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ఆ తీర్మాన ప్రతిని పంపాలా లేక శాస నసభలో ఈ అంశాన్ని చర్చించి తీర్మా నం చేసి పంపించాలా అన్న అంశం పై సమాలోచనలు జరుపు తున్నట్టు చెబుతున్నారు.కీలకమైన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, మహిళా విశ్వ విద్యాలయం బిల్లు లను శాసనసభలో ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం నీట్ అంశంలోనూ తుది నిర్ణయానికి రావాలని యోచిస్తున్నట్టు సమాచారం