–సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినేట్ సమావేశం
–సాగునీటి సంఘాలకు ఎన్నికలతో పాటు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు తొలగింపు
–వివాదాస్పద భూముల రిజిస్ట్రే షన్ నిలిపివేత
–ఏపి నూతన ఎక్సైజ్ విధానానికి ఆమోద ముద్ర
Cabinet Meeting: ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత జగన్ ప్రభు త్వం (jagan government) తీసుకువచ్చిన రివర్స్ టెం డరింగ్ పాలసీకి ముఖ్యమంత్రి చం ద్రబాబు (chandra babu) ప్రభుత్వం స్వస్తి పలికింది. ఈ మేరకు బుధవారం అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశా రు. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాతన పద్ధతిలోనే టెండరింగ్ కొన సాగేలా క్యాబినెట్ (cabinet)ఆమోదించింది.
స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో రద్దు తో పాటు స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ను రద్దు చేసింది. పట్టాదారు పాసు పుస్తకాల పై జగన్ ఫొటో తొలగింపుతో పాటు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వ హణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివా దాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలి పివేతకు ఆమోదించింది.కొత్త ఎక్సై జ్ పాలసీ (excahnge policy) ఆమోదం ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపింది. అలాగే పోలవరం ఎడ మ కాలువ పనుల పునరుద్ధరణకు క్యాబినెట్ ఆమోదించడంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న గుత్తేదారు సం స్థనే కొనసాగించాలని నిర్ణయించిం ది.
పదేళ్ల తర్వాత ఈ కేబినెట్ ..
కాగా దాదాపు పదేళ్ల తర్వాత పేపర్ లెస్ కేబినెట్ భేటీ (cabinet meeting) నిర్వహించారు. 20 14-19 కాలంలో టీడీపీ హ యాంలో ఈ-కేబినెట్ భేటీ జరిగింది. ఆ తర్వాతి ప్రభుత్వం పేపర్ తో కూ డిన కేబినెట్ సమావేశాలు నిర్వ హించింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం కొలువుదీరగా ఈ-కేబి నెట్ విధానాన్ని పునరుద్ధరించింది.
ఏపీలో మున్సిపాలిటీల్లో 269 పోస్టుల భర్తీకి ఆమోదం
ఏపీ సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో క్యాబినెట్ సమావేశం మున్సిపాలిటీల్లో 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటి భర్తీకి నోటిఫికేషన్ రానుంది. అలాగే పౌరసరఫరాల శాఖకు సంబంధించి 2,771 కొత్త రేషన్ షాపులఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అటు ఎక్సైజ్, సచివాల యాల పునర్వ్యవస్థీకరణ, MDU వాహనాల రద్దు సహా పలు అంశా ల పై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.