Calendar listening program: శాలిగౌరారం మార్చి 30.(ప్రజా దీవెన ): శాలిగౌరారం లోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఉగాది పండుగ పురస్కరించుకొని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పంచాంగ శ్రవణం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది.రాశి ఫలాల ను గురుంచి వివరించారు.ఈ సంవత్సరం వర్షాలు బాగా పడి పంటలు పండుతాయని పంచాంగ శ్రవణ కర్త గ్రామ పురోహితులు రామడగు వెంకట్రామశర్మ తెలిపారు.శాలిగౌరారం గ్రామానికి చెందిన ప్రముఖ సిద్ధాంతకర్త శేషభట్టర్ లక్ష్మణ మూర్తి రాసిన పంచాంగం ను ఆవిష్కరించారు.
పంచాంగ శ్రవణ కార్యక్రమం నకు హాజరైన ప్రతి ఒక్కరిని లయన్స్ క్లబ్ వారు ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ధర్మకర్తలు శేషం రత్నమా చార్యులు, నర్సింహా చార్యులు, జగన్ మొహనా చార్యులు,లయన్స్ క్లబ్ చార్టర్ ప్రసిడెంట్ బుడిగె శ్రీనివాసులు, క్లబ్ అధ్యక్షులు డెంకల సత్యనారాయణ, ప్రోగ్రాం ఛైర్మెన్ నిమ్మల వీరస్వామిలయన్స్ ప్రతినిధులు వడ్లకొండ బిక్షం, దునుక వెంకన్న, జోగు శ్రీనివాస్ బట్ట వీరబాబు, చిర్రబోయిన శ్రీనివాస్ నాయకులు సీఎం రెడ్డి, జైపాల్ రెడ్డి, జమ్ము రమేష్, కుతాటి సోమయ్య,తాందరి సత్తయ్య,చింత ధనుoజయ,
సిరందాస్ రాజు తదితరులు పాల్గొన్నారు