–పెరుగుతున్న తల, మెడ క్యాన్సర్లు
–భారత దేశంలో 26 శాతం అవే కేసులు
Cancer Patients:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశంలోని కేన్సర్ రోగుల్లో (Cancer Patients) దాదాపు 26 శాతం మందికి తల, మెడలో కణితులు ఉ న్నాయని, ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతోందని ఒక అధ్యయనం వెల్లడించింది. ఢిల్లీకి చెందిన కేన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ (Cancer Free India Foundation)అనే స్వ చ్ఛంద సంస్థ మార్చి 1 నుంచి జూన్ 30 వరకూ తన హెల్ప్‌లైన్ నంబ ర్కు వచ్చిన కాల్ డేటాను క్రోడీకరిం చి అధ్యయనం నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 1,869 మంది రోగులపై నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను శనివారం ప్రపంచ తల, మెడ కేన్సర్ దినం సందర్భంగా విడుదల చేసిం ది.
పొగాకు వినియోగంతో పాటు హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ల (HPV infections)కారణంగా దేశం లో తల, మెడ కేన్సర్ కేసులు, ప్రత్యే కంగా యువకుల్లో బాగా పెరుగుతు న్నాయని కేన్సర్ ముక్త్ భారత్ ప్రచా రానికి నేతృత్వం వహిస్తున్న సీనియ ర్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆశిశ్ గుప్తా తెలిపారు. కేన్సర్ ముక్త్ భారత్ ప్రచారంలో భాగంగా జాతీయ స్థాయిలో ఉచిత హెల్ప్‌లైన్ 93–555–20202ను ఇటీవలే ప్రారంభించారు. సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకూ పనిచేసే ఈ నంబర్‌కు కేన్సర్ రోగు లు (Cancer patients) కాల్ చేసి ప్రముఖ అంకాల జిస్టులతో నేరుగా మాట్లావచ్చు.