ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర గోవింద నరేష్ అధ్యక్షులు
MRPS Govinda Naresh : శాలిగౌరారం జులై 7 : ఎం ఆర్ పి ఎస్ వర్గీకరణ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ కృషి ఫలితంగనే అయ్యిందని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ అన్నారు. ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవాన్ని శాలిగౌరారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శాలిగౌరారం ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బట్ట చిన సైదులు ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ ముఖ్య అతిథిగా హాజరై మండల కేంద్రం తో పాటు వివిధ గ్రామాల్లో ఘనంగా జండా ఆవిష్కరించి మాట్లాడారు. 31 ఏళ్ల ఉద్యమ ప్రస్తావన లో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సాధించిన ఫలితాల గురించి ప్రజలకు తెలియజేయడం జరిగిందన్నారు.
ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు,పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఆయన చేసిన సేవలు ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బట్ట సైదులు,బట్ట శ్రీను, తాటిపాముల జానయ్య , చింత ధనంజయ, వేముల గోపినాథ్, బట్ట నరసింహ, తాటిపాముల సైదులు,బట్ట లక్ష్మీనారాయణ, కారుపాటి అంబేద్కర్, బాకీ వెంకన్న, గద్దపాటి అరవింద్, వేముల శ్రీకాంత్,బట్ట గణేష్, బట్ట రఘు, బట్ట కిరణ్, మాగి నాగయ్య, కొప్పుల సుధాకర్, బట్ట యోగేష్ కుమార్, ఆయా గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.