–కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ
— విచారణను తప్పుదోవ పట్టించి నందుకు గాను
–ఎఫ్‌ఐఆర్ ఆలస్యంపైనా తలా ఠాణా ఎస్‌హెచ్‌వో అరెస్టు
CBI: ప్రజా దీవెన, కోల్‌కతా: దేశాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్న కోల్‌కతా ఆర్జీ కర్ వైద్య కళాశాల విద్యార్థిని హ త్యాచార కేసులో ఆ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను (Sandeep Ghosh) కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) (cbi)మరోసారి అరెస్టు చేసింది. సాక్ష్యాధారాల ధ్వంసంతో పాటు విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయ త్నించారని అభియోగాలు మోపిం ది. వీటితో పాటు, ఎఫ్‌ఐఆర్ నమోదులో ఆలస్యం చేసినందుకు కేసును తొలుత విచారించిన తలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) అభిజిత్ మండల్‌ను కూడా అరెస్టు చేసింది. మండల్‌ను కొన్ని గంటల పాటు విచారించిన సీబీఐ ఆయన నుంచిసరైన జవాబులు రాకపోవ డంతో అదుపులోకి తీసుకుంది. 8 సార్లు ప్రశ్నించినా ప్రతిసారీ వేర్వేరు సమాధానాలు ఇచ్చారని పేర్కొంది. ఈ కేసులో 17వ తేదీ నాటికి కోల్ కతా హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. మరో ఇద్దరు కోల్‌కతా పోలీ సులపైనా సీబీఐ నజర్ (CBI Nazar)పెట్టినట్లు సమాచారం. కాగా, అంతకుముం దు సీబీఐ సందీప్ ఘోష్‌పై అత్యా చారం అభియోగాలను నమోదు చేసినట్లు పీటీఐ పేర్కొంది. మరో వైపు మెడికోపై హత్యాచారం కేసు లో సందీప్ ఇప్పటికే సీబీఐ విచా రణను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై ఆయనను దర్యాప్తు సంస్థ ఈ నెల 2న అరెస్టు కూడా చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆగస్టు 9న యువ వైద్యురాలు ఆర్జీ కర్ సెమి నార్ హాల్‌లో హత్యాచారానికి గురయ్యారు. హాల్‌లోకి వెళ్లి బయ టకు వస్తున్నట్లుగా ఉన్న సీసీ టీవీ దృశ్యాల మేరకు వాలంటీర్ సం జయ్ రాయ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వ హించింది. నార్కో టెస్టు చేయాల నుకున్న అతడు ఒప్పుకోక పోవ డంతో సాధ్యం కాలేదు.
వైద్యులతో సీఎం మమత చర్చలపై ప్రతిష్ఠంభన
బెంగాల్ వైద్యులు, సీఎం మమతా (CM Mamata) మధ్య చర్చలపై ప్రతిష్ఠంభన వీడ లేదు. బాధిత మెడికో కుటుంబా నికి న్యాయం చేయాలని కోరుతూ నెల రోజులకు పైగా నిరసనలు చేస్తున్న వైద్యులు శనివారం సీఎం తో చర్చలకు సిద్ధమయ్యారు. అయితే వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయాలని పట్టుబట్టారు. విషయం సుప్రీం కోర్టు (Supreme Court)పరిధిలో ఉన్నందున ఇది సాధ్యం కాదని మమతా స్ప ష్టం చేశారు. అంగీకారం కుదిరిన డిమాండ్లపై నిమిషాల్లో సంతకం చేస్తానని కూడా చెప్పారు. దీనికి ముందు ఆమె వైద్యుల దీక్షా శిబి రానికి వెళ్లారు. సీఎం ఆహ్వానం మేరకు ఆమె ఇంటికి వెళ్లినప్పటికీ.. ప్రత్యక్ష ప్రసారానికే పట్టుబట్టడంతో చర్చలు సాగలేదు. 2 గంటల తర్వాత వైద్యులు కన్నీరుపెడుతూ వెళ్లి పోయారు. అయితే, తనను పదేపదే అవమానించ వద్దని ఇప్ప టికే మూడుసార్లు ఇలా చేశారని మమత అసహనం వ్యక్తం చేశారు.