*కార్మిక చట్టాల జోలికొస్తే ఖబర్దార్:శ్రీనివాసరావు
Governments Neglecting Workers : ప్రజా దీవేన, కోదాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీవితాలతో చలగాటమాడుతున్నాయని ఎన్నో పోరాటాలతో సాధించుకున్న కార్మికుల చట్టాల జోలికి వస్తే ఖబడ్ధారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం 139 వ మే డే ను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుండి బైకు కార్మిక ర్యాలీ బయలుదేరి రంగా థియేటర్ చౌరస్తా నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు జరిగింది. అనంతరం ఆర్టీసీబస్టాండ్ ఆవరణలో నిర్వహించిన జరిగినబహిరంగ సభకు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ 1886 లో అమెరికా దేశంలో చికాగో నగరంలో జరిగిన అమరవీరుల పోరాట స్ఫూర్తి నేటి మేడే అని పని గంటల విధానానికై సాగిన పోరులో వేలాది మంది అసువులు బాసిన వారి రక్తం నుండి వచ్చినది ఎర్రజెండా అని గుర్తు చేశారు కానీ .
మన దేశంలో కేంద్రంలో రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలకులు కార్మికుల యొక్క చట్టాలను రద్దు చేస్తున్నారని దానికి రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని రానున్న రోజుల్లో మరిన్ని సమరశీల పోరాటల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని అని పిలుపునిచ్చారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ శ్రమ శక్తిని దోపిడీ చేస్తుందని తెలిపారు దేశవ్యాప్తంగా ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు షేక్ లతీఫ్ ,బత్తిని హనుమంతరావు, సీనియర్ నాయకులు పైడిమర్రి వెంకటనారాయణ ,హమాలి యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి పోతురాజు సత్యనారాయణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు బొల్లు ప్రసాద్ ఏఐటీయూసీ నాయకులు శ్రీనివాస్ వెంకటరెడ్డి విద్యా చారి షేక్ సైదా కర్ల కాంతారావు, వెంకన్న, నయన్ ఖాన్, రాజశేఖర్ కుమార్ ,ఏ శ్రీనివాస్, మాతంగి ప్రసాద్, రామారావు ,తదితరులు పాల్గొన్నారు