Central Cabinet Decision :ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుం ది. దేశవ్యాప్త కులగణనకు ఆమో దం తెలిపింది. జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది.పహల్గాం ఉగ్రదాడిపై పార్లమెంట్ ప్రత్యేక స మావేశాలు నిర్వహించాలని ప్రతి పక్షాలు చేస్తున్న డిమాండ్‌పై చర్చిం చేందుకు బుధవారం రాజకీయ వ్య వహారాల క్యాబినెట్ కమిటీ సమా వేశమైందని, ఈ సందర్భంగా వచ్చే జనాభా లెక్కలతోపాటే కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పా రు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రా ష్ట్రాలు కులగణన చేపట్టాయని అ శ్వినీ వైష్ణవ్ తెలిపారు. వాటిలో కొ న్ని రాష్ట్రాలు రాజకీయ సాధనంగా కులగణనను వాడుకున్నాయని ఆ యన ఆరోపించారు.కాగా కేంద్ర ప్ర భుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాం డ్ చేస్తున్నాయి. అయితే ఆ డి మాండ్‌లను ఇన్ని రోజులుగా కేం ద్రం పక్కన పెడుతూ వస్తున్నది. ఈ క్రమంలో బుధవారం కులగణనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలుప డం సంచలనంగా మారింది.