Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Central Government : ఆగమాగం, అప్పులబాగోతం

Central Government : ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ఆయా రాష్టాల్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు. ప్రతిదానికి కేంద్రం సాయాం చేయాలని దేబురిస్తున్నాయి. అదేపనిగా అప్పులు చేస్తూ ప్రజలపై భారం మోపుతున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి వడ్డీలు కడుతున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్టాల్ల్రో గత కెసిఆర్‌, జగన్‌ ఏలుబడిలో చేసిన లక్షల కోట్లు అభివృద్ది పేరుతో దుబారా చేశారు. ఇప్పుడు వాటికి వడ్డీలకే వేలకోట్లు చెల్లించాల్సి వస్తోంది. ఇదంతా దుబారా కాక మరోటి కాదు. పథకాలపై సవిూక్షించ కుండా ఆయా రాష్టాల్ర ప్రభుత్వాలు పోటీపడి ఉచిత పథకాలు అమలు చేస్తున్నాయి. పెన్షన్లు కూడా భారంగా మారాయి. కిలో రూపాయి బియ్యం పథకం కూడా భారంగా మారింది. వీటిపై సవిూక్షించి, ధరలు పెంచాలన్న ఆలోచన చేయడం లేదు. ఇవన్నీ సవిూక్షిస్తూ నెలకు కనీసం ఐదారువేల కోట్ల రూపాయలు మిగులుతాయి. తెలంగాణనే తీసుకుంటే వేల కోట్లు వడ్డీలు కట్టాల్సి వస్తోందని సిఎం రేవంత్‌ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే గత కెసిఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులు ఎంతగా పెరిగాయో గమనించవచ్చు. అలాగే జగన్‌ చేసిన అప్పులకు కూటమి ప్రభుత్వం కూడా కోలుకోలేకుండా పోయింది. అప్పులు చెల్లించేం దుకు మరిన్ని అప్పులు చేసే బదులు ఖర్చులు తగ్గించుకోవచ్చు.

దుబారాను అరికట్ట వచ్చు. కానీ ప్రభుత్వాలు అలా చేయడం లేదు. ప్రభుత్వ నిర్వహణ అంటే కేవలం అప్పులు చేసి, ప్రజలకు నగదు బదిలీ చేయడం అని జగన్‌ నిరూపించారు. రాష్టాల్రన్ని ఇలా దివాళా దిశగా ఉన్నాయి. ఎక్కడా అభివృద్ది కన్నా ఓట్లు రాబట్టే పథకాలే సాగుతున్నాయి. ఇందుకు ఏ రాష్ట్రం కూడా మినహాయింపు కాదు. అభివృద్ది పక్కకు పోయింది. తెలంగాణలో కాళేశ్వరంపై తప్పులు ఒప్పుకోకుండా బిఆర్‌ఎస్‌ ఎదురుదాడికి దిగుతోంది. ఏ పథకం తీసుకున్నా అవినీతి కనిపిస్తోంది. నోరుంది కదాని బిఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలు,ఆరోపణలు జుగుప్స కలిగిస్తున్నాయి. ప్రతిపనికీ కేంద్రంపై ఆధారపడాల్సి వస్తోంది. రాష్టాల్రు స్వయం సమృద్ది సాధించకపోవడం వల్ల ఇలా దివాళా తీయాల్సి వస్తోంది. అయితే మోడీని ప్రశ్నించే ముందు తమ రాష్టాల్ల్రో తాము ఎంత సచ్చీలంగా పాలన చేస్తున్నామో ఆయా రాష్టాల్ల్రో అధికారంలో ఉన్న పార్టీలు గమనించాలి. ప్రజలు చేస్తున్నవిమర్శలకు సమాధానం చెప్పాలి. అలాగని కేంద్రం చేస్తున్న ఆర్థిక దుర్వినియోగాన్ని తప్పు పట్టకుండా ఉండలేం. కేంద్రం చేస్తున్న దుర్వినియోగాన్ని, దుర్మార్గాలను ఎండగట్టాల్సిందే. అవినీతి నేతలకు త్వరగా శిక్షలు పడాలి. అప్పుడే దేశంలో జవాబుదారీతనం వస్తుంది. ఎంతమంది అవినీతికి పాల్పడ్డారో వారందరినీ ఒకే గాటన కట్టివుంటే బాగుండేది. రాజకీయ అవినీతిని, కార్పోరేట్‌ మోసాలను అరికట్టే విషయంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ మోడీ మాత్రం విమర్శలను పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవడం లేదు. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఎంతకాలం ఇలా ముందుకు వెళతారన్నది చూడాలి. సిబిఐ, ఐటి, ఇడి దాడులపై వస్తున్న ఆరోపణలను పట్టించుకోవడం లేదు.

ఆయా రాష్టాల్ల్రో చిచ్చు పెట్టి అధికారాన్ని చేజిక్కించు కుంటున్న తీరు కాంగ్రెస్‌ పాలనకన్నా దారుణంగా ఉంది. వ్యవస్థలను భ్రష్టు పట్టించిన ఘనత కాంగ్రెస్‌ దయితే..అంతకుమించిన దారుణాలను ఇప్పుడు మోడీ అనుసరిస్తున్నారు. ప్రజల సమ స్యలను పక్కన పెట్టే ఇలాంటి చర్యలు సమర్థనీయం కాదు. ప్రజల సమస్యలను ప్రధానంగా పరిష్కరిస్తూనే…అవినీతి నేతలను బొక్కలో వేయాల్సిందే. రాజ్యాంగ సంస్థలు అందరి విషయంలో సమన్యాయంతో వ్యవహరిం చాల్సిన బాధ్యత వుంది. భారత ప్రజాస్వామ్యం పదికాలాలపాటు పటిష్టంగా నిలదొక్కుకోవాలంటే రాజ్యాంగ వ్యవస్థలు పటిష్టంగా ఉండాల్సిందే.