Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Central Government Budget: మోదీ 3.0 ప్రభుత్వ ప్రాధాన్యత పద్దులు

–కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో పేద ప్రజలకు వరాలు కురిసేనా
–ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చేయూతనిచ్చే అవకాశాలు
–మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు,ఆదాయపన్ను మిన హాయింపు పరిమితి పెంపు
–మధ్యతరగతికి ఊరట కల్పించే చర్యలకు ఊతం
–గృహ నిర్మాణ రంగానికి ప్రోత్సాహ కాలు

Central Government Budget:ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ (Central Government Budget)అనగానే ఏటా ఆదాయపన్ను శ్లాబుల్లో ఏమైనా మార్పులు వస్తాయేమోనని ప్రజలు ఆశగా ఎదురుచూడడం ఆన వాయితీ. అయితే మరో మారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రస్తుతం మరో బడ్జెట్‌కు వేళయ్యింది. ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌ మంగళవారం పూర్తిస్థాయి బడ్జెట్‌ (budget)ను సభ ముందుంచేందుకు సిద్ధమ య్యారు. దీంట్లోనైనా వేతనజీవుల కు, మధ్యతరగతికి ఊరట కల్పి స్తారా సంస్కరణలతోపాటే సంక్షే మానికీ పెద్ద పీట వేస్తారా మౌలిక సదుపాయాలకు భారీ నిధులు ప్రకటిస్తూనే, జనాకర్షక విధానాలను ప్రకటిస్తారా అంటే ఆర్థిక నిపుణులు అవుననే అంచనా వేస్తున్నారు.

మోదీ 3.0 ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో (Central budget) అభివృద్ధి–సంక్షేమంతో పాటు ఆర్థిక లోటు తగ్గించేందుకు చర్యలు ఉంటా యని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గడం, మిత్ర పక్షాలపై ఆధారపడాల్సి రావడం, ఈ ఏడాది ఆఖరులో మూడు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల వంటివాటి నేపథ్యంలో సంస్కరణలకు, జనా కర్షక విధానాలకు, రాష్ట్రాల అవస రాలకు సమానంగా ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్‌ (budget) రూపకల్పన జరిగిందని ఆ వర్గాలు వివరించాయి. ముఖ్యం గా ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌లో పలు చర్యల ను ప్రకటించవచ్చునని సూచనప్రా యంగా వెల్లడించాయి. ఇప్పటికి వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman).. ఎప్పటిలాగానే ఈసారి కూడా మౌలిక సదుపా యాల కల్పనకు పెట్టుబడులను భారీగా పెంచనున్నారు. అందులో భాగంగా రైల్వే, రహదారులు, టెలి కమ్యూనికేషన్లు, ఆటోమొబైల్‌ రంగం, ఆరోగ్య సంరక్షణ, రేవుల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు పెరగనున్నాయి. ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం.. జీడీపీలో 7.7 శాతానికి, మూలధన వ్యయం 3.5 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. అలాగే.. స్థూల ఆర్థిక లోటును 5.6 శాతానికి తగ్గించడం లక్ష్యంగా ఆర్థిక మంత్రి చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం. మొత్తమ్మీద.. మోదీ గత రెండు ప్రభుత్వాల్లో లేనట్టుగా ఈసారి జనాకర్షక విధానాలకు కూడా పెద్ద పీట వేయనున్నట్లు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతివారిని, మహిళలు, రైతులు, వృద్ధులను ఆకట్టుకునేందుకు చర్యలు ప్రకటిస్తారని అంచనాలు వినపడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈసారి బడ్జెట్‌లో ఇలా….

— సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి రంగాల (ఎంఎస్‌ఎంఈ) పటిష్ఠతకు పలు చర్యలు ప్రకటించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈ రంగానికి చేయూత నిచ్చే అవకాశా లున్నాయి. స్టార్టప్‌ ఇండియా సీడ్‌ (Startup India Seed) నిధి క్రింద ఈ రం గానికి నిధులు పెరిగే అవకాశం ఉంది.

–చైనాతో సరిహద్దుల్లో తరచూ ఉద్రి క్తతలు ఏర్పడుతున్న నేప థ్యంలో ఈసారి రక్షణ రంగ బడ్జెట్‌ రూ.6 లక్షల కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.

–అగ్నిపథ్‌ పథకంపై (Agnipath scheme) మిత్రపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చి న నేపథ్యంలో ఆర్మీ నిపుణుల నుం చి వచ్చిన సంస్కరణలను దృష్టిలో ఉంచుకుని అగ్నిపథ్‌లో మార్పులు వచ్చే ఆవకాశాలున్నా యి.ఆదాయ పన్ను కనీస మినహాయింపు పరిమి తిని రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు పెంచవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 80డి కింద ఆరోగ్య బీమా ప్రీమియంలకు మినహాయింపు పరిమితిని మరింత పెంచే చాన్స్‌. అలాగే, మధ్యతర గతిని ఆకట్టుకునేందుకు గృహరు ణాలపై సబ్సిడీని మరింత పెంచవచ్చు.
–ఆయుష్మాన్‌ భారత్‌ క్రింద రూ.5 లక్షల వరకూ బీమాను 70 ఏళ్లు దాటినవారికి కూడా వర్తింపజేస్తా మంటూ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీని ఈ బడ్జెట్‌లో నెరవేర్చవచ్చని భావిస్తున్నారు. మహిళ లకు కూడా ఈ పథకం క్రింద ఆరోగ్య సేవలను పెంచే అవకాశాలున్నాయి.

–ముద్రా యోజన పరిమితిని రూ.20 లక్షలకు పెంచడంతో పాటు సురక్షితం కాని ఎంఎస్‌ఎంఈ రుణాలను రూ.2 కోట్లనుంచి రూ.5 కోట్లకు పెంచవచ్చు. స్టార్టప్‌లపై ఆర్థిక భారం తగ్గించేందుకు మరిన్ని పన్ను రాయితీలు కల్పించవచ్చు.

–రియల్‌ ఎస్టేట్‌ (Real estate) రంగానికి పరిశ్రమ హోదా కల్పించి.. స్వదేశీ, విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలను ప్రక టించే అవకాశాలు లేకపోలేదు. మెట్రో సిటీల్లో శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల ఏర్పాటుతో పాటు అందుబాటు ధరల్లో ఉండేలా గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించే చర్యలు ప్రక టించవచ్చు.

–కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరల పెంపు, గిడ్డంగుల అభివృద్ది, నీటి పారుదల ప్రాజెక్టులకు, ఆహారో త్పత్తుల పరిశ్రమలకు నిధుల పెంచే అవకాశాలున్నాయి.

–పునరుత్పాదక ఇంధన రంగానికి బడ్జెట్‌ లో నిధులు పెరగవచ్చని భావిస్తున్నారు. సోలార్‌, హైడ్రో, పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించవచ్చు.

–విద్యారంగం, నైపుణ్య అభివృద్దికి బడ్జెట్‌ లో కేటాయింపులు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. ప్రభుత్వ ప్రైవేట్‌ భాగస్వామ్యం ద్వారా నైపు ణ్యాభి వృద్దికి, ఉపాధి అవకాశాల కల్ప నకు చర్యలు తీసుకోవచ్చని అం చనాలు న్నాయి.

రైల్వే ప్రాజెక్టులపై ఆశలు… కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంలో ప్రతిపాదించిన పలు రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపులుంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రధానంగా పలు కొత్త ప్రాంతాలను రైల్వేలైన్‌కు అనుసంధానం చేసేందుకు రూ.4,104 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన చిట్యాల–జగ్గయ్యపేట రైల్వేలైన్‌ పనులకు మోక్షం లభించే అవకాశం ఉంది. అలాగే 2,588 కి.మీ దూరానికి డబ్లింగ్‌, ట్రిప్లింగ్‌ తదితర అభివృద్ధి పనులతో పాటు మరో 11 ప్రాజెక్టులకు రూ.32,695 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనలకు కేంద్రం బడ్జెట్‌ లో నిధులు కేటాయించే అవకాశం ఉంది.