
–జనసాంప్రదాయ వైద్యులను స మాజ ఆరోగ్యవ్యవస్థలో భాగస్వా మ్యం దిశగా చారిత్రక అడుగు
–జాతీయ స్థాయిలో గిరిజన వై ద్యుల సామర్థ్యాభివృద్ధి కార్యక్ర మానికి శ్రీకారం
–దేశంలో తొలి జాతీయ గిరిజన ఆరోగ్య పరిశీలనా కేంద్రం ఏర్పాటు
ICMR Ministry : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశవ్యా ప్తంగా గిరిజన వైద్యులను (ట్రైబల్ హీలర్స్) సమాజ ఆరోగ్య వ్యవస్థ లో భాగస్వాములుగా తీర్చిదిద్దే ల క్ష్యంతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoTA) శుక్రవా రం హైదరాబాద్‌లోని కన్హా శాంతి వ నం వేదికగా జాతీయస్థాయి సామ ర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిం చింది. గిరిజన వైద్యులను అధికారి కంగా గుర్తించి, ప్రజారోగ్య వ్యవస్థ తో అనుసంధానించే తొలి జాతీయ ప్రయత్నంగా ఈ కార్యక్రమం చరిత్ర లో నిలవనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘వికసిత్ భా రత్’ లక్ష్యానికి అనుగుణంగా చివరి మైలు వరకు సమగ్ర, సమాజ ఆధా రిత అభివృద్ధిని సాధించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమ ప్రారంభసమావేశానికి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరాం, సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే, తెలంగాణ గిరి జన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్ ఎంపీబలరాం నాయక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ప్ర ముఖ వైద్య, పరిశోధనా సంస్థల ప్ర తినిధులు హాజరయ్యారు. దేశంలో ని వివిధ రాష్టాల నుండి సుమారు 400 మంది గిరిజన సాంప్రదాయ వైద్యులు ఈ సమావేశంలో పాల్గొ న్నారు.
కేంద్ర గిరిజన శాఖ మంత్రి శ్రీ జువల్ ఓరాం ప్రసంగిస్తూ తరతరాలుగా వ చ్చిన భారతీయ ఆదివాసీ వైద్య సంప్రదాయాలను వలస పాలకులు కూడా నిర్మూలించలేకపోయారని చెప్పారు. AIIMS ఢిల్లీ, AIIMS జో ధ్‌పూర్, ICMR భువనేశ్వర్, WH O, ఆయుష్ మంత్రిత్వ శాఖ నిపు ణుల సాంకేతిక శిక్షణ గిరిజన వై ద్యుల సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. సంప్రదాయ వైద్యంపై ఆ ధారిత ఉపాధి అవకాశాల కోసం F MCG, ఔషధ సంస్థలతో భాగస్వా మ్యాలు పరిశీలించాలని రాష్ట్రాల కు సూచించారు.
హార్ట్‌ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ పూజ్య దా జీ ఆధ్యాత్మిక ఆరోగ్యం, యోగా, ధ్యానం ప్రాధాన్యతపై మాట్లాడారు. గిరిజన వైద్యులు కాలం గడిచిపోతే వారి జ్ఞానం అంతరించిపోతున్న ప్ర మాదం ఉందని హెచ్చరించారు. గిరి జన అభివృద్ధి అనేది కేవలం ఆరో గ్య సేవలకే పరిమితం కాకుండా ఉ పాధి, పర్యావరణ పరిరక్షణ, సమ గ్ర సంక్షేమం వైపు దృష్టి పెట్టాలన్నా రు.
కేంద్ర గిరిజన సహాయ మంత్రి శ్రీ దు ర్గాదాస్ ఉయికే మాట్లాడుతూ విక సిత్ భారత్ లక్ష్యంలో షెడ్యూల్డ్ తె గల పాత్ర కీలకమని చెప్పారు. జీ వనశైలి వ్యాధులు పెరుగుతున్న నే పథ్యంలో సంప్రదాయ జ్ఞానం, ఆధు నిక విజ్ఞానం, సాంకేతికత, సంక్షేమ పథకాలను సమన్వయం చేయా ల్సిన అవసరం ఉందన్నారు. గిరి జ నుల స్థిరమైన జీవన విధానం స మాజానికి అనేక పాఠాలు నేర్పు తుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడు తూరాష్ట్రంలో గోండ్లు, కోయలు, చెంచులు, కోలంలు, కొండ రెడ్డీలు సహా 33 గిరిజన తెగలు ఉన్నాయ ని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలు, సామూహి క ఆరోగ్య కేంద్రాలను మరింత బలో పేతం చేయాల్సిన అవసరం ఉంద ని, రాష్ట్ర స్థాయి గిరిజన అవసరా లను జాతీయ స్థాయిలో బలంగా వినిపించాల్సిన అవసరం ఉంద న్నారు. రవాణా సదుపాయాల లేమి, సమాచార లోపాలు, భా షా–సాంస్కృతిక భేదాలు, ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై నమ్మకం లోపిం చడం వంటి కారణాలు చివరి గ్రా మాల వరకు వైద్య సేవలు చేర డాన్ని ప్రభావితం చేస్తున్నాయని మంత్రి వివరించారు.
ఈ పరిస్థితుల్లో విద్య, ఆరోగ్యం రెం డూ సమాజ అభివృద్ధికి కీలక అం శాలుగా ఉన్నాయని స్పష్టం చేశా రు.ఇలాంటి సందర్భాల్లో గిరిజన సమాజాల్లో తరతరాలుగా సేవలం దిస్తున్న సాంప్రదాయ గిరిజన హీల ర్లు ప్రజల విశ్వాసాన్ని సంపాదించు కున్న ముఖ్యమైన వ్యక్తులని మంత్రి అన్నారు. అనేక ప్రాంతాల్లో వారు మొదటి సంప్రదింపు స్థాయిలో ఆ రోగ్య మార్గదర్శకులుగా వ్యవహరి స్తున్నారని, ఈ వాస్తవాన్ని గుర్తించి విధానాలు రూపొందించినప్పుడే ఆరోగ్య కార్యక్రమాలు విజయవంత మవుతాయని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి కేం ద్రమంత్రులకు సమ్మక్క సరళక్క జా తరలు హాజరు కావాలని ఆహ్వాన పత్రికను అందించారు. అలాగే ఆ సియాలోనే అతిపెద్ద జాతరగా పేరు గాంచినందున ఈ జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ జాతరగా గుర్తిం చాలని విజ్ఞప్తి చేసారు. కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత తెలంగాణలో గిరిజన ప్రాం తాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్య త ఇస్తోందని మంత్రి తెలిపారు. గిరి జన సంక్షేమాన్ని కేవలం పథకాల ప్రకటనల వరకే పరిమితం చేయ కుండా, క్షేత్రస్థాయిలో అమలు జరి గేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆరోగ్య సేవలు అందని గ్రామాలు, హాబిటేషన్లను నేరుగా క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రజల వద్దకే వెళ్లి వాస్తవ పరిస్థితులను అంచనా వేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.
తెలంగాణలోని చెంచు, కొలాం, తో టి, కొండారెడ్డి వంటి PVTG స ము దాయాలు ఇంకా అనేక సమ స్యల ను ఎదుర్కొంటున్నాయని, ఈ ప్రాం తాలకు ప్రత్యేక కార్యాచరణ అవస రమని మంత్రి అన్నారు. గిరిజన హీ లర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా ప్రజారోగ్యంపై అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం అందే లా చేయడం సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా గిరిజన హీలర్లను ప్రజారోగ్య వ్య వ స్థకు సహాయకులుగా చేర్చే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని మం త్రి స్పష్టం చేశారు.
వారి సాంప్రదాయ జ్ఞానాన్ని గౌ ర విస్తూ, ప్రాథమిక లక్షణాల గుర్తింపు, ప్రమాదకర పరిస్థితులను ముందు గానే గుర్తించడం, అవసరమైన సం దర్భాల్లో ఆసుపత్రులకు రిఫర్ చే యడంపై శిక్షణ ఇవ్వాలని సూచిం చారు.మాతృ–శిశు ఆరోగ్యం, గర్భి ణీల సంరక్షణ, చిన్నపిల్లల పోషణ, అంటువ్యాధుల నివారణ వంటి రం గాల్లో గిరిజన హీలర్ల పాత్రను మ రింత సమర్థవంతంగా ఉపయోగిం చుకోవచ్చని మంత్రి అన్నారు. టిబి, మలేరియా, సీజనల్ వ్యాధులను తొలిదశలో గుర్తించి ప్రభుత్వ వైద్య వ్యవస్థకు అనుసంధానం చేయడం లో ఈ కార్యక్రమం కీలక పాత్ర పో షిస్తుందని తెలిపారు.
ASHA కార్యకర్తలు, ANMలు, ప్రా థమిక ఆరోగ్య కేంద్రాలు, మొబైల్ హెల్త్ యూనిట్లతో గిరిజన హీలర్ల సమన్వయం ద్వారా ఆరోగ్య సేవల వ్యాప్తి మరింత పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే టెలీమెడిసిన్ వంటి ఆధునిక సేవ లను గిరిజన ప్రాంతాలకు విస్త రిం చడంలో హీలర్ల సహకారం ప్రజల్లో నమ్మకం పెంపొందిస్తుందని చెప్పా రు. ఈ కార్యక్రమం కేవలం శిక్షణతో ముగియకుండా, శిక్షణ అనంతరం ఫాలోఅప్, పర్యవేక్షణ, బాధ్యతతో కూడిన వ్యవస్థ ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్య భద్ర తే ప్రధాన లక్ష్యంగా, తప్పు వైద్యం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీ సుకుంటూ ఈ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి త్వ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి వెల్లడించారు. కేం ద్ర–రాష్ట్ర సమన్వయంతో ఈ కా ర్యక్రమాన్ని అమలు చేసి, నిజంగా అవసరమైన గిరిజన కుటుంబాలకు ఆరోగ్య సేవలు చేరేలా చర్యలు తీ సుకుంటామని తెలిపారు. ఈ సం దర్భంగా అదనపు కార్యదర్శి మ నీష్ ఠాకూర్ మాట్లాడుతూ గిరిజన వైద్యులకు వారి సమాజాల్లో తర త రాలుగా విశ్వాసం, సామాజిక అంగీ కారం ఉన్నాయని చెప్పారు. ము. ఖ్యంగా నివారణాత్మక వైద్యం, వ్యా ధుల తొలిదశ గుర్తింపు, సమయా నుకూల రిఫరల్ వంటి అంశాల్లో గి రిజన వైద్యులు కీలక పాత్ర పోషిం చగలరని పేర్కొన్నారు. భౌగోళిక, సాంస్కృతిక, వ్యవస్థాపక అడ్డంకు ల వల్ల గిరిజన ప్రాంతాల్లో వైద్య సే వలు పూర్తిగా చేరడం లేదని, విశ్వ సనీయమైన గిరిజన వైద్యుల భా గ స్వామ్యం చివరి మైలు సేవలను బ లోపేతం చేస్తుందని తెలిపారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల కార్యద ర్శి రంజనా చోప్రా మాట్లాడుతూ స మాజ ఆధారిత ఆరోగ్య విధానాల ప్రధాన భూమికను గిరిజన వైద్యు లు నిర్వహిస్తున్నారని అన్నారు. ఇ వి తక్కువ ఖర్చుతో, స్థిరమైనవిగా ఉండటంతో పాటు స్థానిక అవసరా లకు అనుగుణంగా ఉంటాయని చె ప్పారు. మలేరియా, క్షయ, కుష్టు వంటి సంక్రమణ రోగాలు ఇప్పటికీ అనేక గిరిజన జిల్లాల్లో ఉన్నాయని, వాటి నిర్మూలనకు లక్ష్యసాధనతో కూడిన చివరి ప్రయత్నం అవసర మని పేర్కొన్నారు.
ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి వచ్చిన గిరిజన వైద్యులతో జరిగిన సంభాషణలో వారు గౌర వ ప్రదమైన గుర్తింపు, సంప్రదాయ వై ద్య జ్ఞానం తరతరాలకు బదిలీ అ య్యే వ్యవస్థ, అరుదైన ఔషధ మొ క్కల సంరక్షణపై తమ అభిప్రాయా లను వ్యక్తం చేసారు. దేశవ్యాప్తంగా లక్ష మంది గిరిజన సాంప్రదాయ వై ద్యులను అధికారికంగా గుర్తించి, ఆ రోగ్య సేవల్లో భాగస్వాములుగా చే యడమే లక్ష్యమని వెల్లడించారు.
మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ పొగాకు వి నియోగం వంటి జీవనశైలి కారణా ల వల్ల గిరిజన ప్రాంతాల్లో క్షయవ్యా ధి ఇంకా విస్తరిస్తోందని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, వసతి గృహాలు వంటి మౌలిక వసతులు అవగాహన పెంచుతున్నాయని, ర హదారులు, విద్య, ఆరోగ్య రంగా ల్లో మరింత పెట్టుబడులు అవసర మని అన్నారు.ఈ సమావేశంలో ముఖ్య ఘట్టంగా, గిరిజన వ్యవ హారాల మంత్రిత్వ శాఖ మరియు ఐసీఎంఆర్–ప్రాంతీయ వైద్య పరి శోధనా కేంద్రం, భువనేశ్వర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ‘ప్రాజెక్ట్ దృష్టి’ కింద భారత్ ట్రైబల్ హెల్త్ ఆబ్జర్వేటరీ (B-THO) పేరుతో దేశంలో తొలి జాతీయ గిరిజన ఆరో గ్య పరిశీలనా కేంద్రం ఏర్పాటు కా నుంది. దీని ద్వారా గిరిజన ప్రాంతా లకు సంబంధించిన ఆరోగ్య డేటా సేకర ణ, పరిశోధన, మలేరియా, కు ష్టు, క్షయ నిర్మూలన కార్యక్రమాల కు శాస్త్రీయ ఆధారం లభించనుంది.





