Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Central Home Ministry: 1037 మందికి సర్వీసు అవార్డులు

Central Home Ministry: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: స్వాతం త్య్ర దినోత్సవాన్ని (Independence Day) పురస్క‌ రించు కొని పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోం గార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ అధికారులకు వివిధ పోలీసు పతకాలను (Police Medal)కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దేశవ్యా ప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను (Gallantry/Service Medals)అందజేయ నుంది. ఈ మేరకు అవార్డుల జాబి తాను విడుదల చేసింది. గ్యాలం ట్రీలో 213 మెడల్స్‌, పీఎంజీలో 1 మెడల్‌, 94 మందికి పీఎస్‌ఎం మెడల్స్‌, 729 మందికి ఎంఎస్‌ఎం మెడల్స్‌ ప్రకటించింది. ఇక గ్యాలం ట్రీలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి నాలు గు మెడల్స్‌, తెలంగాణకు 7 మెడ ల్స్‌ దక్కాయి. ఎంఎస్‌ఎం విభాగం లో ఏపీకి 19, తెలంగాణకు 11 మెడల్స్‌ వచ్చాయి. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్క రించుకొని కేంద్ర హోం శాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు పతకా లను ప్రకటిస్తుంటుంది.