–తెలంగాణ శాసన మండలి ఛై ర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Chairman Gutta Sukhender Reddy : ప్రజా దీవెన, బీబీనగర్: తెలంగాణ లో అన్ని వర్గాల సంక్షేమం కోసం తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చే స్తోందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నా రు. సీనియర్ సిటీజన్స్ కోసం ప్రభు త్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని చె ప్పారు. తల్లిదండ్రుల యోగక్షే మా లు చూడకుండా వదిలేస్తే వారిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోం దని హెచ్చరించారు. యాదాద్రి భు వనగిరి జిల్లా బీబీనగర్ పట్టణ కేం ద్రంలో బుధవారం తెలంగాణ వ యో వృద్దుల సంక్షేమ సంఘ ఆశ్ర య భవనాన్ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువన గిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ లు ప్రారం భించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ నాన్నలకు అ న్నం పెట్టకుండా వారిని ఇబ్బందు లకు గురిచేస్తే వారిని శిక్షించే అధికా రం జిల్లా కలెక్టర్, ఆర్ డిఓలకు ప్ర భుత్వం అధికారం కల్పించిందని తెలిపారు. కొందరు యువకులు డ్ర గ్స్ , మద్యానికి బానిసలుగా మారి డబ్బుల కోసం సొంత అమ్మ నాన్న లను చంపేస్తున్న వార్తలను చూస్తే చాలా బాధ కలుగుతోందని ఆవే దన వ్యక్తం చేశారు. పెన్స్షనర్లకు ప్ర భుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని అన్నారు. రానున్న రో జుల్లో రాష్ట్రంలోని ప్రతి పౌరునికి ఇ న్సూరెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అ నే కోణంలో సర్కార్ ఆలోచన చే స్తుందని గుర్తు చేశారు. బాధ్యత గల పౌరునిగా వృద్ధులు, పెన్షనర్లకు ఎలాంటి సహాయ సహకారాలు కా వాలన్న అందిస్తానని హామినిచ్చా రు.